
India Vs Australia
India Vs Australia: భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ యుద్ధానికి రంగం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీ నుంచి నాగపూర్ వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. ఈ బోర్డర్ -గవస్కర్ ట్రోఫీపై రెండు దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ బోలెడు అంచనాలున్నాయి. చాలా మంది ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రెండూ సమఉజ్జీల జట్ల పోరాటం చూసి తీరాలని ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి ఆట ఉత్కంఠ రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య సీరిస్ అంటే మిగతా దేశాల్లోని క్రీడాకారులకు కూడా ఆసక్తే ఉంటుంది. చాలా రోజుల తరువాత మళ్లీ భారత్, ఆస్ట్రేలియాలు తలపడుతున్నాయి. రెండూ టాప్ 2 జట్లు కావడం గమనార్హం. ఈనెల 9 నుంచి సీరిస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో ఒకటి విశాఖలోనూ ఆడనున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా టీం భారత్ గడ్డపై అడుగుపెట్టింది.అటు భారత్ వార్మప్ మ్యాచ్ కు బీసీసీఐ అవకాశం ఇచ్చినా వీటికి ఆస్ట్రేలియా దూరంగా ఉంది.
ఈ సిరీస్ లో మొత్తం నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నారు. గురువారం నుంచి టెస్ట్ మ్యాచ్ లు జరుగుతాయి. టెస్ట్ క్రికెట్ లో భారత్, ఆస్ట్రేలియాలు జట్లు కలిసి 102 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 43 సార్లు గెలుపొందింది. 30 మ్యాచ్ లను భారత్ గెలిచింది. 28 టెస్టులు డ్రా అయ్యాయి. ఒక మ్యాచ్ టై అయింది. ఇవే కాకుండా ఇరు జట్ల మధ్య అనేక రికార్డులు నెలకొన్నాయి. భారత కాలమానం ప్రకారం.. టెస్ట్ మ్యాచ్ లన్నీ ఉదయం 9.30కు ప్రారంభం అవుతాయి. వన్డే మ్యాచ్ లు మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతాయి.
భారత జట్టులోకి తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ దూరంగా ఉన్నాడు. అలాగే ఆస్ట్రేలియా పాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ కూడా గాయంతో తొలి టెస్టుకు దూరంగా ఉంటాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య అనేక రికార్డులు నెలకొన్నాయి. అటు భారత్, ఇటు ఆస్ట్రేలియా క్రికెటర్లు అత్యధిక స్కోర్లు చేసి ఆకట్టుకున్నారు. వీటిలో కొన్ని రికార్డులను చూద్దాం..

India Vs Australia
– 2004లో సిడ్నీలో జరిగిన టెస్టులో భారత్ 7 వికెట్ల నష్టానికి 705 అత్యధిక పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
-1947లో జరిగిన బ్రిస్బెన్ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 226 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది.
-2020లో జరిగిన ఆడిలైడ్ టెస్టులో భారత జట్టు కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయింది.
-2012లో జరిగిన సిడ్నీ టెస్టులో మైఖేల్ క్లార్క్ 329 పరుగులు చేసిన రికార్డు నెలకొల్పాడు.
-ఆస్ట్రేలియా జట్టుపై సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 11 టెస్ట్ సెంచరీలు చేశాడు.
-ఈ జట్టుపై సచిన్ 39 మ్యాచ్ లు ఆడాడు. వీటిలో 74 ఇన్నింగ్స్ లలో 3630 పరుగులు చేయడం విశేషం.
-ఆస్ట్రేలియాలో జరిగిన 20 మ్యాచుల్లో అనిల్ కుంబ్లే 38 ఇన్నింగ్స్ లో 111 వికెట్లు తీశాడు.
-1959లో కాన్పూర్ టెస్టులో భారత్ ఆటగాడు జేసుభాయ్ పటేల్ 69 పరుగులకు 9 వికెట్లు తీశాడు.
-2012లో జరిగిన ఆడిలైట్ టెస్టులో రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ 386 పరుగులు చేశారు.