
India vs Australia 2nd ODI Visakhapatnam
India vs Australia 2nd ODI Visakhapatnam: ఆ స్టేడియం అంటే క్రీడాభిమానులకు పూనకాలే.. బ్యాటింగ్ చేసేవారకి పండగే.. ఇక స్పిన్నర్లయితే ఈ మైదానంలో తమ టాలెంట్ ను మొత్తం షో చేస్తారు. అదే వైజాగ్ (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) స్టేడియం. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ ఇప్పటికే శుభారంభం చేసింది. ఇప్పుడు కీలక మ్యాచ్ ఆదివారం వైజాగ్ స్టేడియంలో ఆడబోతుంది. సాగర తీరాన గెలుపు మ్యాచ్ ను సొంతం చేసుకోవడానికి తహతహలాడుతోంది. అయితే ఇప్పటికే రెండు రోజుల పాటు వర్షాలు దంచి కొట్టాయి. మరో రెండురోజులు మేఘావృతం అవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. ఆదివారం మధ్యాహ్నం వరుణుడు కరుణిస్తే రెండో వన్డే దబిడ.. దిబిడే.. అని క్రీడాలోకం ఉత్సాహంతో ఎదురుచూస్తోంది.
వైజాగ్ స్టేడియం భారత క్రీడాకారులకు అచ్చొస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ టీమిండియా 10 వన్డేలు ఆడింది. వీటిలో 7 నెగ్గింది. ఒక మ్యాచ్ టై, మరొకటి రద్దు కాగా.. ఇంకొకటి ఓడిపోయింది. అంటే ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయినట్లు రికార్డులు ఉన్నాయి. ఈ స్టేడియంలో బ్యాట్మెన్లు పండుగ చేసుకుంటారు. తమ బ్యాట్ దెబ్బకు బాల్స్ బౌండరీలు దాటుతాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలకు ఈ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లి ఆరు వన్డేలు ఆడారు. 556 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ ఆరు వన్డేలు ఆడారు. 68.40 సగటుతో 342 పరుగులు చేశాడు.

India vs Australia 2nd ODI Visakhapatnam
స్పిన్నర్లకూ విశాఖ స్టేడియం అనుకూలమే. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు ఇక్కడ మంచి రికార్డు ఉంది. ఆయన మూడు మ్యాచులు ఆడి 9 వికెట్లు తీశాడు. మిగతా వారు కూడా తమ ఫర్ఫామెన్స్ చూపించి రన్స్ చేయకుండా కట్టడి చేశారు. ఆస్ట్రేలియాతో ఇక్కడ భారత్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. అందులో విజయం సాధించింది. ఇప్పుడు జరిగే వన్డేపై అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ విజేతను డిసైడ్ చేస్తుండడంతో విశాఖ స్టేడియం దేశంలో కీలకంగా మారింది. ఇప్పటికే టిక్కెట్లు దక్కించుకున్న చాలా మంది మ్యాచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే తుఫాను ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు పడ్డాయి. శుక్ర, శనివారాల్లో భారీ వర్షం కురిసింది. ముందు జాగ్రత్తగా స్టేడియంలో కవర్లను కప్పి జాగ్రత్త పడ్డారు. అయితే ఆదివారం డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో అందరి దృష్టి వరుణుడిపైనే ఉంది. ఈ ఒక్కరోజు కరుణించాలని క్రీడాభిమానులు వరుణుడిని ప్రార్థిస్తున్నారు. వరుణుడి దయ చూపిస్తే క్రీడాకారులతో పాటు అభిమానులకు పండగే.. పండుగ..