India vs Australia : ఇందుకే కదా.. బుమ్రా అంటే ప్రత్యేకం అని చెప్పేది!
ఆస్ట్రేలియా మరింత భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. స్లాగ్ ఓవర్ పొదుపుగా వేయడంతో బుమ్రా మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.


Jasprit Bumrah
India vs Australia : రాజ్ కోట్.. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడవ వన్డే. అప్పటికి 48 ఓవర్లు పూర్తయ్యాయి. ఆస్ట్రేలియా స్కోరు 340. క్రీజులో లబూ షేన్, కమ్మిన్స్ ఉన్నారు. లబూ షేన్ ఇప్పటికే 70 పరుగులకు చేరువలో ఉన్నాడు. అతడి జోరు చూస్తుంటే ఆస్ట్రేలియా స్కోర్ ను తక్కువలో తక్కువ 360 పైచిలుకు పరుగులకు చేర్చే విధంగా కనిపిస్తున్నాడు. రాజ్ కోట్ మైదానం కూడా బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చివరి రెండు ఓవర్లలో దాదాపు ఆస్ట్రేలియా బ్యాటర్లు వీరవిహారం చేస్తాడని ఒక అంచనాకు వచ్చాడు. కానీ మనసులో ఏదో ఒక మూల ఆశ. భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లను నిలువరిస్తారని. ఏదైతే అది అయింది అనుకుని బుమ్రా కు బౌలింగ్ బాధ్యత అప్పగించాడు. స్లాగ్ ఓవర్ అవడంతో పొదుపుగా బంతులు వేయాలని అతడికి సూచించాడు. కెప్టెన్ తో సరే అని బు అన్నాడు.
బంతి అందుకున్న బుమ్రా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తొలి బంతి వైడ్ అయింది. దీంతో రోహిత్ శర్మ నిరాశ చెందాడు. మరుసటి బంతి డాట్ బాల్ వేశాడు. మరో బాల్ కు లబు షేన్ సింగిల్ తీశాడు. ఆ తర్వాత బంతి హాఫ్ సైడ్ వేయడంతో కమ్మిన్స్ టచ్ చేసి సింగిల్ తీశాడు. ఈసారి బంతి కూడా అలా వేయడంతో లబూ షేన్ టచ్ చేయలేకపోయాడు.. మరుసటి బంతిని లబూ షేన్ లాంగ్ ఆన్ లోకి ఆడటంతో రెండు పరుగులు వచ్చాయి. మరుసటి బంతిని భారీ షాట్ ఆడబోయి లబూ షేన్.. శ్రేయాస్ అయ్యర్ కు దొరికిపోయాడు.
సాధారణంగా స్లాగ్ ఓవర్లో పరుగులు ధారాళంగా వస్తూ ఉంటాయి. ఎంత తోపు బౌలర్ అయినప్పటికీ బ్యాటర్లు ఎదురు దాడికి దిగుతారు. దీంతో స్కోర్ బోర్డు ఉరకలెత్తుతుంది. కానీ బుమ్రా 49 ఓవర్ ను అద్భుతంగా వేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా స్కోర్ కు కళ్లెం వేశాడు. అప్పటికి లబూ షేన్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. కానీ బుమ్రా హాఫ్ సైడ్ వేసిన అద్భుతమైన బంతులకు బెంబేలెత్తిపోయాడు. కాగా బుమ్రా వేసిన ఈ ఓవర్ ను స్ఫూర్తిగా తీసుకొని చివరి ఓవర్ ను వేసిన సిరాజ్ కూడా పొదుపుగా బౌలింగ్ వేశాడు. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఆస్ట్రేలియా మరింత భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. స్లాగ్ ఓవర్ పొదుపుగా వేయడంతో బుమ్రా మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.
