India Tour Of Bangladesh 2022: ఇండియా క్రికెట్ జట్లు ఆదివారం నుంచి బంగ్లాదేశ్‌తో క్రికెట్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌కు ముందు రెండు జట్లకు షాక్‌లు తగులుతున్నాయి. బంగ్లాదేశ్ జట్టు ఏకంగా కెప్టెనే మార్చాల్సి వచ్చింది. ఇక ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ కూడా గాయపడినట్లు సమాచారం.

India Tour Of Bangladesh 2022
నిరాశపర్చిన న్యూజిలాండ్ టూర్..
ఇటీవల న్యూజిలాండ్ టూర్ వెళ్లిన ఇండియా ఆ దేశంతో టీ20, వన్డే సిరీస్ ఆడింది. టీ20లో విజయం ససాధించినప్పటికీ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ టూర్‌కి సిద్ధమైంది. ఆదివారం జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో టూర్ మొదలవుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఢాకాలోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగనున్నాయి.
తొలి వన్డే ఆదివారం జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
14 నుంచి టెస్ట్ మ్యాచ్‌లు..
వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఈనెల 14 నుంచి రెండు జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. డిసెంబర్ 14–18 వరకు చట్టోగ్రమ్ వేదికగా తొలి టెస్ట్, డిసెంబర్ 22–26 వరకు ఢాకా వేదికగా రెండో టెస్ట్ జరగుతుందిజ రెండు టెస్ట్‌లు 9.30కు ప్రారంభం కానున్నాయి.
బంగ్లా జట్టులో ఇద్దరికి గాయాలు..
అయితే, భారత్‌తో కీలక వన్డే సిరీస్ ఆడనున్న బంగ్లాదేశ్‌కు షాకుల మీద షాకులు తగిలాయి రెగ్యులర్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తోపాటు స్టార్ పేసర్ టస్కిన్ అహ్మద్ గాయంతో జట్టుకు దూరమయ్యారు. దీంతో ఆ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. గాయపడ్డ బంగ్లా సారథి తమీమ్ స్థానంలో కొత్త సారథి జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఆ జట్టుకు టెస్టులలో వైస్ కెప్టెన్‌గా ఉన్న లిటన్ కుమార్‌దాస్.. ఇండియాతో మూడు వన్డేలకు బంగ్లాను నడిపించనున్నాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ప్రకటించింది. లిటన్ దాస్.. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో ఆడిన మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. లిటన్ దాస్.. 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. మరోవైపు.. బంగ్లా స్టార్ పేసర్ టస్కిన్ అహ్మద్ వెన్ను నొప్పి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో షోరిఫుల్ ఇస్లాం జట్టుతో చేరాడు. వెన్నునొప్పి తగ్గకుంటే టస్కిన్ తర్వాత రెండు వన్డేలు కూడా ఆడేది అనుమానమే.

India Tour Of Bangladesh 2022
ప్రాక్టిస్‌లో కెప్టెన్‌కు గాయం..
భారత్‌తో వన్డే సిరీస్ కు ముందు నవంబర్ 30న ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తమీమ్‌కు గాయమైంది. అతడి గాయాన్ని పరిశీలించిన వైద్యులు తమీమ్ కు రెండు వారాల విశ్రాంతి అవసరమని తేల్చి చెప్పారు. దీంతో తమీమ్ భారత్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వన్డే సిరీస్‌తో పాటు అతడు తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉండేది అనుమానంగానే ఉంది.
టీమిండియాకూ అనుకోని షాక్.. ?
ఒకవైపు బంగ్లాదేశ్ గాయాలతో సతమతమవుతుండగా, భారత జట్టుకు కూడా తొలి మ్యాచ్‌కు ముందు షాక్ తగిలింది. భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా మొత్తం వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్టు సమాచారం. తొలి మ్యాచ్ కోసం శనివారం ప్రాక్టీస్ చేస్తుండగా షమీ చేతికి గాయమైంది. దానిని పరిశీలించిన వైద్యులు అతనికి రెండు వారాలు విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చినట్లు తెలిసింది.