India Today Survey on AP Elections : ఇండియా టుడే సర్వే అంచనాలతో ఆంధ్ర రాజకీయాలు హాట్ హాట్ గా

ఇండియా టుడే సర్వే అంచనాలతో ఆంధ్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

  • Written By: NARESH
  • Published On:

India Today Survey on AP Elections : ఇండియా టుడే సర్వే హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సర్వేను బయటపెట్టినా.. ఏపీ పరిస్థితులపై మాత్రం నర్మగర్భంగా లీక్ చేశారు. సెఫాలజిస్ట్ యశ్వంత్ దేశ్ ముఖ్ ఏపీలో టీడీపీకి 15 సీట్లు వస్తాయని ఒక లీక్ చేశారు. ఒక టీజర్ లాగా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మొత్తం సర్వేను ఇండియా టుడేను బయటపెట్టారు.

తాజాగా ఇండియా టుడే టీవీ ఛానల్ ఒక సర్వేను ప్రకటించింది. రాజ్దీప్ సర్దేశాయ్ ప్రకటించిన తాజా సర్వే ప్రకారం ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 15 లోక్ సభ స్థానాలు టిడిపికి లభిస్తాయని తేలింది. దేశవ్యాప్తంగా లోక్ సభ భ స్థానాల ప్రాతిపదికన ఇండియా టుడే సంస్థ సర్వే చేపట్టింది. ప్రజల మూడ్ ను తెలుసుకొని మూడ్ ఆఫ్ ద నేషన్ ప్రోగ్రాం లో సెఫాలజిస్టులు ఒక అంచనా వేశారు. ఇదే సర్వేలో ఏడాది కిందట టిడిపికి ఏడు లోక్సభ సీట్లు లభించాయి. మధ్యలో ఆ సంఖ్య పదికి చేరింది. ఇప్పుడు ఏకంగా 15కు ఎగబాకింది. పొత్తులు లేకుండానే టిడిపికి ఈ స్థానాన్ని లభిస్తాయని ఇండియా టుడే స్పష్టం చేసింది.

గత ఎన్నికల్లో అధికార వైసిపికి 23 పార్లమెంట్ స్థానాలు లభించాయి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 151 సీట్లను ఆ పార్టీ దక్కించుకుంది. మరోసారి తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల వెల్లడైన సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పుడు టిడిపికి 15 లోక్సభ స్థానాలు వస్తాయని అంచనా వేయడం వైసిపి జీర్ణించుకోలేకపోతోంది.ప్రతి లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీకి 105 అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇండియా టుడే సర్వే అంచనాలతో ఆంధ్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Read Today's Latest View point News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు