సరిహద్దుల్లో చీటికి మాటికి కవ్విస్తున్న చైనాకు మరోసారి భారత్ గట్టి హెచ్చరిక పంపింది.ఇప్పటికే చైనాకు చెందిన 59 చైనా యాప్స్ ను దేశంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి డ్రాగన్ దేశానికి షాక్ ఇచ్చింది.
తాజాగా మరో 118 చైనీస్ మొబైల్ యాప్ లపై కేంద్రం నిషేధం విధించి సంచలనం సృష్టించింది. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్ జీ, క్యామ్ కార్డ్, బైడ్ , కట్ కట్ సహా మొత్తం 118 యాప్ లు ఉన్నట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ తెలిపింది.
గతంలో గాల్వన్ లోయలో 20 మంది భారత సైనికులను చంపిన చైనాపై నాడు ప్రధాని మోడీ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. చైనాకు తొలి హెచ్చరిక పంపారు మోడీజీ. .నాడు 59 యాప్ లను నిషేధించారు. దేశవ్యాప్తంగా మోడీ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే నిషేధానికి గురైన చైనా యాప్స్ జాబితాలో జూమ్, పబ్ జీ లేకపోవడంపై చర్చ మొదలైంది. జూమ్ యాప్ ను ‘ఎరిక్’ అనే అమెరికా పౌరుడు ప్రారంభించాడు. అయితే ఈ యాప్ యూజర్ల సమాచారాన్ని చైనాకు చేరవేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఎరిక్ ఖండించాడు కూడా…
ఇక పబ్ జీ గేమ్ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ తయారు చేసింది. అయితే డిస్ట్రిబ్యూషన్ హక్కులు మాత్రం ఓ చైనా కంపెనీకి ఉన్నాయి.
ఇలా చైనాకు దగ్గరగా ఉన్న ఈ రెండు యాప్ లపై మోడీజీ నిషేధం విధించలేదు. పబ్ జీ చైనాదేనని అందరూ చెబుతుంటారు. మరీ మోడీజీ ఎందుకు ఈ యాప్ పై నిషేధం విధించలేదు. పబ్ జీ చైనాది కాదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు తాజాగా మళ్లీ ఉద్రిక్తతల నేపథ్యంలో మరికొన్ని చైనా యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో పబ్ జీ సీక్లీనర్ లాంటి చైనీస్ యాప్స్ ఉన్నాయి.