India Vs Pakistan: భారత్ – పాకిస్తాన్ మ్యాచ్.. వర్షం పడితే ఎవరికి లాభం? ఎవరికి టెన్షన్?
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కారణంగా క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొన్నా వర్షం ఏం చేస్తుందో అన్న అనుమానాలు మొదలయ్యాయి. బాలగోళ తుఫాను కారణంగా శనివారం భారీ వర్షం కురిసింది.

India Vs Pakistan: భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉందంటే రెండు దేశాల్లోని క్రీడాభిమానులే కాదు ప్రపంచమంతా ఆసక్తి నెలకొంటుంది. రెండు దేశాల మధ్య ఇతర విషయాల్లో ఉన్న వైరుధ్యాన్ని క్రీడాకారులు తమ ఆటలో పోటీ పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కసిగా ఒకరికి మించి ఒకరు ఆడుతూ ఉంటారు. దీంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రీడాకారులకు పండుగే. ఆసియా ప్రపంచ కప్ లో భాగంగా శనివారం భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ యుద్ధం జరగనుంది. శ్రీలంక దేశంలోని పల్లెకెలే వేదికగా ఈ మ్యాచ్ సాగనుంది. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు చూస్తే భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈమ్యాచ్ పై రకరకాల అనుమానాలు ఉన్నాయి.
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కారణంగా క్రీడాకారుల్లో ఉత్సాహం నెలకొన్నా వర్షం ఏం చేస్తుందో అన్న అనుమానాలు మొదలయ్యాయి. బాలగోళ తుఫాను కారణంగా శనివారం భారీ వర్షం కురిసింది.వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ ప్రారంభానికి ముందు క్యాండీలో 68 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వర్షం కురిస్తే మ్యాచ్ కొనసాగే అవకాశం ఉండదు.
మ్యాచ్ ప్రారంభం అయిన తరువాత వర్షం కురిస్తే దానిని రద్దు చేసి చెరో పాయింట్ ఇస్తారు. ఈ సమయంలో పాకిస్తాన్ జట్టుకు మూడు పాయింట్లు వచ్చి సూపర్ 4 కు అర్హత పొందుతుంది. ఈ నేపథ్యంలో భారత్ కు నేపాల్ పై విజయం సాధించడం చాలా ముఖ్యమవుతుంది. ఒక వేళ ఈ మ్యాచ్ రద్దయిన తరువాత నేపాల్ పై భారత్ ఓడిపోతే ఇంటిబాట పట్టాల్సిందే. అందువల్ల వర్షం కారణంగా పాకిస్తాన్ కు లాభం చేకూరుతుంది. భారత్ ను టెన్షన్లో పెట్టేస్తుంది.
పాకిస్తాన్ నుంచి ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజమ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘ సల్మాన్, ఇప్తికార్ అహ్మద్, షాదాబ్ఖాన్, మహమ్మద్ నవాజ్, షహీన్ షా అఫ్రిదీ, నసీమ్షా, హరిస్ రవూఫ్ ఉన్నారు.
