India Vs Pakistan: భారత్ – పాకిస్తాన్ మ్యాచ్: ఆయన లేని లోటు కనిపిస్తుంది..
గత ఏడాది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ టాప్ ఆర్డర్ అర్ష్ దీప్ సింగ్ ను పడగొట్టాడు. దీంతో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. ఈసారి అతన్ని తీసుకుంటే బాగుండేది అన్న చర్చ సాగుతోంది.

India Vs Pakistan: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికి క్రేజ్ ఉంటుంది. ఆసియా కప్ 2023 లో భాగంగా సెప్టెంబర్ 2న రెండు దయాది దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ దిగారు. అయితే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తారు. ఈ సమయంలో టీమిండియా ఒక్కోసారి కొన్ని మిస్టేక్ లు చేస్తుంటుంది. ఈసారి కూడా ఓ మిస్టేక్ చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలక్లన్లలో తడబడినట్లు తెలుస్తోంది. అదేంటంటంటే?
భారత్ తో తలపడడానికి పాకిస్తాన్ జట్టు ఒకరోజు ముందే టీంను ప్రకటించింది. కానీ భారత్ మాత్రం చివరి వరకు ప్రకటించలేదు. అయితే టీమిండియా ఎంచుకున్న ప్రకారం జట్టులో విరాట్ కోహ్లితో పాటు శుభ్ మన్ గిల్, కోహ్లి, శ్రేయాస్, ఇసాన్, హార్దిక్, జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లను ఎంపిక చేశారు. అయితే ఈ జట్టుల లెప్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఒక్కరూ కూడా లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత ఏడాది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ టాప్ ఆర్డర్ అర్ష్ దీప్ సింగ్ ను పడగొట్టాడు. దీంతో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. ఈసారి అతన్ని తీసుకుంటే బాగుండేది అన్న చర్చ సాగుతోంది. కానీ అతని లేకుండానే జట్టును అనౌన్స్ చేశారు. ఇలాంటి ఆటగాడు జట్టు లో లేకపోతే టీం సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆయను తీసుకోకపోవడానికి కారణాలేంటో చెప్పలేదు.
