Asia Cup 2023: ఏషియా కప్ ఫైనల్లో గెలిస్తేనే ఇండియా వరల్డ్ కప్ గెలవగలదు…
అయితే చాలా రోజులనుంచి వరల్డ్ కప్ స్క్వాడ్ లో తీసుకుంటారు అని చాలా ఆశ పడిన శిఖర్ ధావన్ కి టీం లో ఛాన్స్ ఇవ్వడం లో లేదు…ఇక దానితో ఆయన ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడి చాలా రోజులే అవుతుంది.

Asia Cup 2023: ఇంకో నెల రోజుల్లో జరిగే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే ఒక 15 మంది తో కూడిన ఇండియన్ టీం స్క్వాడ్ ని సెలెక్ట్ చేసి అనౌన్స్ చేయడం జరిగింది.నిజానికి ఈ స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్లలో ఎవరికైనా ఇంజురీ జరిగితే వీళ్ళకి బ్యాకప్ లో ఏ ప్లేయర్ కూడా లేడు అనే విషయాన్నీ మన చీఫ్ సెలెక్టర్ అయినా అజిత్ అగార్కర్ ని అడిగితే ఇప్పుడు టీం లో ఉన్న 15 మంది ప్లేయర్లతో మేము వరల్డ్ కప్ ఆడిస్తాం. ఒకవేళ ఏ ప్లేయర్ కి అయినా గాయం అయితే ఆయన ప్లేస్ లో ఇంకో ప్లేయర్ ని అప్పుడే తీసుకుంటాం అని టీం ని సెలెక్ట్ చేసిన రోజున అగార్కర్ చెప్పాడు.కొంతవరకు ఈ నిర్ణయం కరెక్ట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఇండియన్ టీం స్క్వాడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అయినప్పటికీ ఒకసారి టీం ని కనక చూసుకుంటే రోహిత్ శర్మ, శుభమన్ గిల్,విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్,హార్దిక్ పాండ్య, శ్రేయాస్ అయ్యర్, కె ఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా,కుల్దీప్ యాదవ్…లాంటి ప్లేయర్లు ఇండియన్ టీం సెలెక్ట్ చేసిన వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నారు.
అయితే చాలా రోజులనుంచి వరల్డ్ కప్ స్క్వాడ్ లో తీసుకుంటారు అని చాలా ఆశ పడిన శిఖర్ ధావన్ కి టీం లో ఛాన్స్ ఇవ్వడం లో లేదు…ఇక దానితో ఆయన ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడి చాలా రోజులే అవుతుంది…ఇక శిఖర్ ధావన్ తో పాటు గా రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉంటె బాగుండేది.ఎందుకంటే అశ్విన్ రైట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి తను వేసే బౌలింగ్ తో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ మీద ప్రెజర్ తీసుకువస్తాడనే చెప్పాలి.ఇక టీం లో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నప్పటికీ వాళ్ళు ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లే కావడం నిజంగా ఒక వంతు కు బ్యాడ్ విషయం అనే చెప్పాలి…ఒక రైట్ హ్యాండ్ స్పిన్నర్ ని సెలెక్ట్ చేసి ఉంటె బాగుండేది…
అయితే ఈ టీం తో మన టీం వరల్డ్ కప్ గెలుస్తుందా,లేదా అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…మన టీం ఇప్పటికే ఏషియా కప్ లో సూపర్ గా ఆడుతూ ఫైనల్ కి చేరుకుంది.మొన్నటిదాకా మన టీం లో చాలా సందేహాలు ఉండేవి కానీ ఇప్పుడు అవేమి లేవు ఎందుకంటే అందరుకూడా చాలా మంచి ఫెర్ఫామెన్స్ ని ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఏషియాకప్ లో అందరు బాగానే ఆడుతున్నారు.కానీ వరల్డ్ కప్ అంటే అందులో ప్రపంచ లో ఉన్న అన్ని క్రికెట్ టీంలు పాల్గొంటాయి కాబట్టి వాటన్నిటి మీద ఇండియా గెలవగలదా ముఖ్యంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి టీంలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి.వీటన్నిటిని ఓడిస్తే కానీ మన టీం కి కప్ రాదు..అయితే మనం వరల్డ్ కప్ కొట్టగలం అని ప్రపంచానికి తెలియాలంటే ముందుగా మన వాళ్ళు ఈ ఏషియా కప్ ని సక్సెస్ ఫుల్ గా ముగించాలి…ఇక మరికొందరు మాత్రం ఈసారి వరల్డ్ కప్ ఇండియాలో జరగుతుంది కాబట్టి ఈసారి ఇండియా వరల్డ్ కప్ కొట్టకపోతే మాత్రం దానికి మించిన అవమానం ఇంకొకటి లేదు అని అంటున్నారు…ఇక ఇండియాన్ క్రికెట్ అభిమానులందరికి వరల్డ్ కప్ గెలిచే ముందు శాంపిల్ గా ఏషియా కప్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని ఇండియన్ ప్లేయర్లు చూస్తున్నట్టు గా తెలుస్తుంది…
