
India Vs Australia Test Series 2023
India Vs Australia Test Series 2023: టెస్ట్ క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీలలో బోర్డర్_ గవాస్కర్ ట్రోఫీ ఒకటి. భారత్_ ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ సీరిస్ చాలా చిరస్మరణీయమైనది. ఫిబ్రవరి 9 నుంచి ఈ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో పైనల్ చేరుకునేందుకు ఇండియా ఆస్ట్రేలియా ను ఓడించాల్సిన అవసరం ఉంది. 2020_21 లో ఆసీస్ ను 2_1 తేడాతో భారత్ ఓడించింది. అంతే కాదు గత మూడు బోర్డర్_ గవాస్కర్ టోర్నీలను ఇండియానే గెలిచింది. ఈ సారి కూడా ఇండియా జట్టే బలంగా కనిపిస్తోంది. అలాగని ఆస్ట్రేలియాను తక్కువ చేసి చూడలేం. కంగారూలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. భారత్ పిచ్ ల పై ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఈ ఐదుగురు కీలకం
9 న మొదలయ్యే టోర్నీలో ఈ ఐదుగురు ఆటగాళ్లు కీలకం.. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్ లలో ఒకడు. షేన్ వార్న్ అనంతర కాలంలో ఆసీస్ కు దక్కిన అస్త్రం.. లియాన్ తన ప్రదర్శన తో మ్యాచ్ ను మలుపు తిప్పగలడు. ఇప్పటికే ఆస్ట్రేలియా తరపున తరఫున 115 టెస్ట్ మ్యాచ్ ల్లో 460 వికెట్లు పడగొట్టాడు. ఈ సీరిస్ లో అతడు రాణించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తాయి కాబట్టి..2021 నుంచి అతడు 17 మ్యాచ్ ల్లో 31.78 సగటుతో 66 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. కానీ అతడి స్ట్రైక్ రేట్ 74.7 కావడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. ఇక ఈ సీరిస్ లో ఆసీస్ లియోన్ పైనే ఆధారపడి ఉన్నది. లియోన్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో ఇక పోయినప్పటికీ బోర్డర్_ గవాస్కర్ ట్రోఫీలో భారత్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు.
కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ ఇటీవల తన లయ అందుకున్నాడు. ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అభిమానులను అలరించే ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కానీ ఇదంతా వైట్ బాల్ క్రికెట్ లో జరుగుతున్నది. కోహ్లీ రెడ్ బాల్ ఫామ్ ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నది. కోహ్లీ గత ఏడాది 26.50 కంటే తక్కువ సగటుతో 265 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల బంగ్లాదేశ్ సిరీస్ లో నాలుగు ఇన్నింగ్స్ ల్లో 45 పరుగులు మాత్రమే చేశాడు. కానీ కోహ్లీ లయ అందుకుంటే అతడిని ఆపడం చాలా కష్టం.. 2014 ఇంగ్లాండ్ తో జరిగిన సీరిస్ ను పరిశీలిస్తే అతడు ఐదు మ్యాచ్ ల్లో 134 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ అతని పునరాగమనం అద్భుతం. అడి లైడ్ లో రెండు సెంచరీలు బాదాడు.. బోర్డర్ _ గవాస్కర్ ట్రోఫీ 2014లో విరాట్ మొత్తం 692 పరుగులు చేశాడు.. ఇప్పటికీ ఇది ఆస్ట్రేలియాలో ఒక ఇండియన్ ప్లేయర్ చేసిన అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్ లలో కలిపి ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 1682 పరుగులు చేశాడు.. అందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ మళ్లీ మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ఇండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వరుసగా రెండోసారి చేరుకోవడానికి కోహ్లీ అత్యంత కీలకం.
ఇక ఈ ట్రోఫీ లో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ రెడ్_ హాట్ ఫామ్ లో ఉన్నాడు.. ఇటీవల దక్షిణాఫ్రికా తో జరిగిన సీరిస్ లో 231 పరుగులు చేశాడు. స్మిత్ కు భారత్ పై మంచి రికార్డ్ ఉంది. 2017 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో పుణె లో 109 పరుగులతో అతడు ఆడిన ఇన్నింగ్స్ అందరికీ గుర్తే ఉంటుంది. ర్యాంక్, టర్నర్ పిచ్ ల్లో భారత్ స్పిన్నర్లను అతడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. రాబోయే సీరిస్ లో స్మిత్ ను ఎదుర్కోవడం భారత బౌలర్లకు అంత సులభం కాదు.

India Vs Australia Test Series 2023
ఇక భారత జట్టుకు ఉపశమనం కలిగించేలా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి పునరాగమనం చేశాడు. 2022 ఆసియా కప్లో మోకాలికాయంతో జడేజా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉన్నాడు. అతడి రాక ఆస్ట్రేలియాకు ఒక హెచ్చరిక.. ఇటీవల తమిళనాడు తో సౌరాష్ట్ర తరఫున రంజి మ్యాచ్ ఆడిన జడేజా మూడు ఇన్నింగ్స్ ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ సెటప్ లో లాంగ్ స్పెల్ లను బౌల్ చేయడమే కాకుండా ఆరు లేదా ఏడో వికెట్ వద్ద బ్యాటింగ్ చేసే జడేజా జట్టుకు కొండంత బలం. భారత్ లో ఆడిన 36 మ్యాచ్ ల్లో 20.66 సగటు తో 175 వికెట్లు పడగొట్టి గొప్ప రికార్డు సృష్టించాడు..2022లో ఆడిన ఐదు ఇన్నింగ్స్ ల్లో 82 సగటు సాధించాడు.
ఇక ఈ టోర్నీ లో అత్యంత ముఖ్యమైన ఆటగాడు పూజారా. తన టెస్ట్ కెరియర్ ప్రారంభం నుంచి ఆసీస్ పై మెరుగ్గా రాణిస్తున్నాడు. 2018 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 521, 2020-21లో 274 పరుగులు చేశాడు. పుజారా ఇటీవలి బంగ్లా దేశ్ సీరిస్ లో 226 పరుగులు చేశాడు.