India – Australia ODI Series: రోహిత్, కోహ్లీ, హార్ధిక్ పాండ్య ఔట్.. బీసీసీఐ సంచలన నిర్ణయం
ఒకసారి రెండు మ్యాచ్ లకు ఇండియా టీం ని గనక చూసుకున్నట్లయితే మొదటి రెండు మ్యాచ్ లకి కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

India – Australia ODI Series: ఈనెల 22 24 27వ తేదీల్లో ఇండియా ఆస్ట్రేలియా తో ఆడనున్న 3 వన్డేలకి సంబంధించిన టీం ని ఇండియన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్ అయినా అజిత్ అగర్కర్ ప్రకటించడం జరిగింది. అందులో భాగం గానే ఏషియా కప్ లో గాయపడిన అక్షర్ పటేల్ కి రెస్ట్ ఇవ్వడం జరిగింది.ఆయన ప్లేస్ లో ఇండియన్ టీం లోకి సీనియర్ స్పిన్ బౌలర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ రావడం జరిగింది. ఇక మొదటి రెండు మ్యాచ్ల్ ల్లో విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ ,హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వడం జరిగింది. ఈ రెండు మ్యాచ్ లకి కె.ఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక మూడో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , హార్దిక్ పాండ్యా ముగ్గురు కూడా అందుబాటులో ఉంటారు. ఆ మ్యాచ్ కి రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు వరల్డ్ కప్ ముందు ఇండియా ఆస్ట్రేలియా టీముల మధ్య ఈ మ్యాచ్ లు జరగడం అనేది రెండు జట్లకి కూడా ఒక మంచి ప్రాక్టీస్ మ్యాచ్ లా అవుతుందని రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఈ మ్యాచ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ లకు తెలుతేజమైన తిలక్ వర్మకి కూడా మరో అవకాశం ఇవ్వడం జరిగింది. ఒకసారి రెండు మ్యాచ్ లకు ఇండియా టీం ని గనక చూసుకున్నట్లయితే మొదటి రెండు మ్యాచ్ లకి కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.ఇక ఈ టీం ని కనుక ఒకసారి చూసుకుంటే కెల్ రాహుల్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్ ,శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్,తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ ,రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ , ప్రసిద్ధి కృష్ణ లాంటి ప్లేయర్లతో ఇండియా మొదటి రెండు మ్యాచ్ లు అడనుంది…
ఇక మూడో వన్డేలో గనక ఇండియన్ ప్లేయర్లను చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. శుభామాన్ గిల్ ,విరాట్ కోహ్లీ ,శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్,రవీంద్ర జడేజా,ఇషాన్ కిషన్, కేల్ రాహుల్ , అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ శామి, జస్ప్రీత్ బూమ్రా,మహమ్మద్ సిరాజ్ లు ఈ మ్యాచ్ లు అడనున్నారు…
