Virat Kohli : కింగ్ భయపడ్డాడు…. అంటూ పాక్ అభిమానుల అతి
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ ఇద్దరినీ తన బౌలింగ్ తో తికమక పెట్టి అవుట్ చేసింది షాహీన్ అఫ్రిది కావడం గమనార్హం.

Virat Kohli : విధ్వంసకర బ్యాటింగ్లో ఆరితేరిన క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. అతను ఫుల్ ఫామ్ లో ఆడడం మొదలుపెడితే ఎంత ప్రమాదకరమైన ఆటగాడో అందరికీ తెలిసిందే. అయితే నిన్న ఆసియా కప్ 2023లో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తరువాత పాక్ అభిమానులు విరాట్ కోహ్లీ భయపడ్డాడు అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం అతను ఇచ్చిన ఒకే ఒక రియాక్షన్.
క్రికెట్ అభిమానులకు మంచి ఊపు ఇచ్చే దాయాదుల పోరు నిన్న శ్రీలంక ,
క్యాండీలోని పల్లెకెలె స్టేడియం లో ఎంతో ఉత్కంఠత మధ్య మొదలైంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కి దిగి దుమ్ము దులుపుతారు అనుకున్న టీం కాస్త పేలవమైన పర్ఫామెన్స్ కి పరిమితం అయింది. చాలావరకు సింగిల్ ఫిగర్ తో స్టార్ ప్లేయర్స్ వెనక్కి తిరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆరంభంలోని టీం ని ముందుంచి నడిపించాల్సిన కెప్టెన్ రోహిత్ శర్మ…విరుచుకుపడి బంతి బౌండరీలు దాటించాల్సిన విరాట్ కోహ్లీ పెవీలియన్ చేరుకున్నారు. పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షాహీన్ ఆఫ్రిది వేసిన పదునైన బంతులకు భారత్ బ్యాటర్లు తడబడిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 11 పరుగులు సాధించగా విరాట్ కోహ్లీ ఒకే ఒక పరుగు కి అవుట్ అయి పెవీలియన్ చేరుకున్నాడు.
ఈ నేపథ్యంలో షాహిన్ అఫ్రిది వేసిన ఒక బంతిని సరిగా అంచనా వేయలేకపోయినా రోహిత్ ని చూసి కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కింగ్ భయపడ్డాడు.. అంటూ ఆ రియాక్షన్ ఫోటో వీడియో టాగ్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తమ బౌలర్ల ధాటికి ఇండియన్ స్టార్ క్రికెటర్లు కూడా జంకాల్సిందే అంటూ పలు రకాల పోస్టులు కూడా పెడుతున్నారు.
అసలు విషయానికి వస్తే…మ్యాచ్ ఐదవ ఓవర్ చివరి బంతికి షాహిన్ వేసిన స్వింగింగ్ డెలివరీ తో రోహిత్ డిఫెన్స్ ఆడబోయాడు. అయితే అతను ఊహించిన దానికి భిన్నంగా ఆ బాల్ కాస్త స్వింగ్ అయి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లి కూర్చుంది. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని కోహ్లీ అయ్యబాబోయ్ బాల్ ఏంటి రా ఇలా వేస్తున్నావ్…అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. నిజానికి కోహ్లీ మనసులో ఏమనుకున్నాడో ఆ టైంలో ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చాడు ఎవరికి తెలియదు.
కానీ పాక్ అభిమానులు మాత్రం మ్యాచ్ గెలిచినందుకు సంబరపడిపోవడంతో పాటు…కింగ్ భయపడ్డాడు అని మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో లేనిపోని హడావిడి సృష్టిస్తున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ ఇద్దరినీ తన బౌలింగ్ తో తికమక పెట్టి అవుట్ చేసింది షాహీన్ అఫ్రిది కావడం గమనార్హం.
