Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుతో పెరిగిన సానుభూతి.. సంచలన సర్వేలో వెల్లడి
చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సి ఓటర్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో సంచలన ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు అరెస్టుతో టిడిపికి విపరీతమైన సానుభూతి వచ్చిందని ఈ సర్వేలో వెల్లడి అయ్యింది.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ దేశ వ్యాప్త చర్చకి దారితీసింది. ఎన్నికల ముంగిట చంద్రబాబు అరెస్టు తప్పిదమని.. జగన్ వ్యూహాత్మక తప్పిదం చేశారని విశ్లేషణలు వెలువడుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ కు సానుభూతి పెరిగిందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే దీనిని జగన్ సర్కార్ లైట్ తీసుకుంటోంది. సానుభూతి వర్కౌట్ అయ్యే పరిస్థితులు లేవని తేల్చి చెబుతోంది. జగన్ వ్యూహాత్మకంగానే చంద్రబాబును అరెస్టు చేయించారని.. త్వరలో లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారని వైసీపీ నేతలు హెచ్చరికతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. అనూహ్య అరెస్టులతో .. టీడీపీ క్యాడర్ ఆత్మస్థైర్యం పై దెబ్బ కొట్టారని సంతోషపడుతున్నారు. ఈ తరుణంలో అధికార వైసీపీ నేతలకు ఓ చేదు వార్త.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సి ఓటర్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో సంచలన ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు అరెస్టుతో టిడిపికి విపరీతమైన సానుభూతి వచ్చిందని ఈ సర్వేలో వెల్లడి అయ్యింది. సి ఓటర్ సర్వేను ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ ట్విట్ చేయడంతో.. అది ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రాజకీయ కుట్రతోనే చంద్రబాబును అరెస్టు చేశారని ఏపీ ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది.
చంద్రబాబు అరెస్టుతో జగన్లో అభద్రతాభావము పెరిగిపోయినట్లు సర్వే ద్వారా వెళ్లడైంది. చంద్రబాబు అరెస్టు ప్రభావం రాబోయే ఎన్నికల్లో తప్పకుండా చూపుతుందని తేలింది. అటు జనసేనతో పొత్తుతో చంద్రబాబు అధికారంలోకి రావటం ఖాయమని తేల్చేసింది. చంద్రబాబు అరెస్టుతో పెద్దగా నష్టం లేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతుండడాన్ని కూడా ఈ సర్వే గుర్తించింది. ఈ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉందని తెలుగుదేశం, జనసేన అభిప్రాయపడుతుండగా… కాదని వైసిపి చెబుతోంది.
మరోవైపు ఈ సర్వే ఫలితాలతో ఎల్లో మీడియా విశ్లేషణలు ప్రారంభించింది. గత కొద్దిరోజులుగా చంద్రబాబు అరెస్టుతో టిడిపి శ్రేణులు నైరాస్యంలోకి వెళ్ళిపోయాయి. ఈ తరుణంలో సి ఓటర్ సర్వే వారికి చాలా రకాలుగా ఉపశమనం ఇచ్చినట్లు అయింది. అయితే వైసిపి ఈ సర్వే ను లైట్ తీసుకుంది. ఎల్లో మీడియా మాత్రం ప్రత్యేక డిబేట్లు పెట్టి మరి చర్చిస్తోంది. సర్వే వాస్తవం అని చెప్పేలా ప్రయత్నిస్తోంది.
