Drivers Strike Impact : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనేది సామెత. పెళ్లిలో ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకోవడం కామనే. కొన్ని నవ్వు పుట్టిస్తుంటే మరికొన్ని మాత్రం వింతగా ఉంటాయి. ఇంకొన్ని మాత్రం విచిత్రంగాను ఉంటాయి. డ్రైవర్ల నిరసన వారికి శాపంగా మారింది. వాహనాలన్ని సమ్మెలో ఉండటంతో ఆ పెళ్లి కొడుకు కాళ్లకు పని చెప్పక తప్పలేదు. అది కిలోమీటరో రెండు కిలోమీటర్లో కాదు ఏకంగా 28 కిలోమీటర్లు నడిచి వధువు గ్రామానికి చేరుకున్నారు. దీంతో వారికి అలసట మిగిలింది. సంతోషం మాత్రం కనబడలేదు.
ఒరిస్సాలోని రాయగడ జిల్లాలో జరిగిన సంఘటన అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. శునఖండీకి చెందిన నరేశ్ ప్రస్కాకు దిబలపాడు గ్రామానికిచెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. దీంతో వారి పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక వధువు గ్రామానికి చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇంతలో పిడుగులాంటి వార్త వాహనాల సమ్మె జరిగింది. దీంతో వాహనాలు కదలలేదు. అక్కడ పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
ఏం చేయాలన్నా వాహనం కావాలి. వారేమో సమ్మెలో ఉన్నారు. ఏం చేయడానికి పాలుపోలేదు. ఇక చేసేది లేక కాళ్లకు పని చెప్పారు. ఏకంగా 28 కిలోమీటర్లు వరుడితో పాటు కుటుంబ సభ్యులు కూడా నడిచారు. దీంతో వధువు గ్రామానికి చేరుకునే సరికి ఓ రోజు గడిచింది. ఎట్టకేలకు పెళ్లి మాత్రం జరిపించారు. కానీ వారు నడిచి నడిచి కాళ్ల నొప్పులతో అందరు బాధపడ్డారు. వారి పెళ్లి వీరికి శాపంగా మారింది. సమ్మె ప్రభావం వారిని నడిచేలా చేసింది. అన్ని కిలోమీటర్లు నడవడంతో ముసలివారికి కాళ్లు లేవలేదు.
కొన్ని సార్లు కొన్ని సంఘటనలు మనకు విస్తు గొలపడం సహజమే. ప్రస్తుతం ఈ ఘటన కూడా అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది. అంత దూరం కాళ్లకు పనిచెప్పడంతో నీరసించిపోయారు. ఎవరిలో కూడా నవ్వు కనిపించలేదు. ఒప్పుకున్న పాపానికి అంత దూరం నడిచి వెళ్లి మరీ పెళ్లి చేసుకోవడంతో వరుడిని అందరు మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీరి గురించి ప్రస్తావన రావడంతో అవాక్కవుతున్నారు. వివాహం కోసం అంత దూరం నడిచిన వారికి అందరు దండాలు పెడుతున్నారు.