Samantha: సమంత ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని అందమైన ప్రదేశాల్లో తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతోంది. అయితే, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విషయాన్ని పంచుకుంది. ఆ ఇద్దరి వల్లే నేనింకా బ్రతికి ఉన్నాను అంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. సమంత.. స్విట్జర్లాండ్ టూర్ లో భాగంగా అక్కడ స్కీయింగ్ చేసింది.

Samantha
అయితే, ఆ స్కీయింగ్ వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ‘గతంలో ఎప్పుడూ ఇది ట్రై చేయలేదు. స్కీయింగ్ సాహసోపేతమైంది. అనుకోకుండా ఏదైనా జరిగితే ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అయినా సరే నేను దాన్ని విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలతో ఉన్నానంటే.. దానికి కారణం స్కీయింగ్ ట్రైనర్స్ కేట్, టోనెస్కి’ అని సమంత ఒక మెసేజ్ రాసుకొచ్చింది.
ఇక సమంత తన నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి.. ప్రస్తుతానికి సోలో లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. స్కీయింగ్ చేయడానికి ఎల్లో జాకెట్, వైట్ ప్యాంట్ ధరించి మంచు కొండల్లో సామ్ ఇచ్చిన పోజ్ లు నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేశాయి. దీంతో సామ్ కొత్త ఫోటోలు నెట్టింట బాగా వైరల్ గా మారాయి. మొత్తానికి సమంత ఈ ఏడాది సరికొత్త ప్రయాణం మొదలు పెట్టి.. అన్ని కొత్తగా చేస్తోంది.
Also Read: స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న సమంత !
పైగా తన భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తున్నాను అంటూ.. తన ఆశలు, తన ఆశయాల వెనుక అనేక కష్టాలు ఉన్నా.. దైర్యంగా ముందుకు వెళ్తాను అంటూ సామ్ చెప్పుకొస్తోంది. మొత్తమ్మీద సామ్ కి చైతు ఎడబాటు ఎనో పాఠాలు నేర్పింది అని ఆమె మాటలను బట్టి అర్ధం అవుతుంది.
పైగా సినిమాల పరంగా కూడా సమంత ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఇన్నాళ్లు అనేక వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా కెరీర్ పై ఫోకస్ చేయలేదు. కానీ తాజాగా ఆ ఇబ్బందులకు ఫుల్ స్టాప్ చెప్పి.. సామ్ ప్రస్తుతం కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. దాంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.
Also Read: ‘సమంత’ షాకింగ్ నిర్ణయం.. చైతు తో మళ్లీ కలుస్తుందా ?