Ugadi 2023: ఉగాది రోజు వీటిని కొంటే డబ్బే డబ్బు..
Ugadi 2023: తెలుగువారి నూతన సంవత్సరం ‘ఉగాది’తో మొదలవుతుంది. అందుకే ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమిరోజున ఉగాది పర్వదినం వస్తున్నందున ఈరోజు ప్రారంభోత్సవాలు జరుపుకుంటారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సమకుడిని సంహరించింది ఉగాది రోజునే అయినందున ఈరోజు ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. శాలీవాహనుడు ఉగాది పర్వదినం నుంచి పాలనను ప్రారంభించాడని పురాణాలను భట్టి తెలుస్తోంది. ఇలా ఉగాది పండుగ ఎన్నో విషయాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే ఉగాది రోజున కొన్ని వస్తువులను […]


Ugadi 2023
Ugadi 2023: తెలుగువారి నూతన సంవత్సరం ‘ఉగాది’తో మొదలవుతుంది. అందుకే ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమిరోజున ఉగాది పర్వదినం వస్తున్నందున ఈరోజు ప్రారంభోత్సవాలు జరుపుకుంటారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సమకుడిని సంహరించింది ఉగాది రోజునే అయినందున ఈరోజు ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. శాలీవాహనుడు ఉగాది పర్వదినం నుంచి పాలనను ప్రారంభించాడని పురాణాలను భట్టి తెలుస్తోంది. ఇలా ఉగాది పండుగ ఎన్నో విషయాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే ఉగాది రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేయాలని, అలా చేస్తే ఐశ్వర్యవంతులవుతారని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఆ వస్తువుల గరించి తెలుసుకుందాం.
షడ్రుచుల సమ్మేళనం ఉండే పండుగే ఉగాది అని చెప్పుకుంటారు. ప్రకృతి పరవశిస్తూ, మోడువారిన చెట్లు చిగురిస్తూ.. పూల పరిమళాలతో పులకింపజేసే ఉగాది పండుగనాడు ఆనందంగా ఉండాలని చెబుతున్నారు. అందు కోసం ఉదయమే నిద్రలేవాలని చెబుతున్నారు. సాధారణ రోజుల్లో కంటే ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆ తరువాత తల స్నానం చేసి కొత్త దుస్తులు ధరించడం వల్ల ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. కొందరికి పండుగలంటే మాంసాహారంతో సంతోషంగా ఉంటారు. కానీ ఉగాది రోజున అస్సలు మాంసం జోలికి పోకూడదు. మద్యపానం చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఉగాది పండుగ లో మరో విశిష్టమైన కార్యక్రమంలో పంచాంగ శ్రవణం. పట్టణాలు, గ్రామాల్లోని ఆలయాల్లో, కూడళ్లలో పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ ఏడాదంతా జరిగే విషయాలను తెలుసుకునేందుకు అందరూ ఒక్కచోటికి చేరుతారు. అయితే పంచాంగం వినేటప్పుడు దక్షిణ ముఖంగా కూర్చోకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే పంచాంగాన్ని శ్రద్ధగా వినాలని చెబుతున్నారు. ఇతరులతో మాట్లాడుకుంటూ, సెల్ ఫోన్ వాడుతూ వినడం చేయకూడదని చెబుతున్నారు.

Ugadi 2023
ఉగాది పచ్చడి ఈ పండుగ మరో స్పెషల్. చేదుగా ఉండే వేప, పుల్లగా ఉండే చింత, వగరుగా ఉండే మామిడి, తీయగా ఉండే బెల్లంతో పాటు ఉప్పు, కారంలను షడ్రుచులు అంటారు. వీటి సమ్మేళనంతో చేసేదే ఉగాది పచ్చడి. ఈరోజు ఉగాది పచ్చడి సేవించడం వల్ల వచ్చే వేసవిలో ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజు చేసే బొబ్బట్లు మధురంగా ఉంటాయి. వీటిని నేతితో చేస్తే మరింత రుచికరంగా ఉంటాయి.
ఉగాది పర్వదినం సందర్భంగా కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని పండితులు చెబుతున్నారు. ఈరోజు గొడుగు కొనుగోలు చేయాలని అంటున్నారు. అలాగే విసనకర్రను కూడా కొనడం మంచిదని అంటున్నారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా ఐశ్వర్యం వర్దిల్లుతుందని అంటున్నారు. అలాగే ఈరోజున విసనకర్రను దానం చేయడం ద్వారా వద్దన్నా డబ్బు వస్తుందని చెబుతున్నారు. ఉగాది తరువాత వేసవి వస్తుంది. పూర్వకాలంలో చల్లదనం కోసం విసనకర్రను ఎక్కువగా ఉపయోగించేవారు. అందువల్ల విసనకర్రను దానం చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుందని, దీంతో దేవతలు మీకు సంతోషంగా ఉండేలా దీవిస్తారని చెబుతున్నారు.