Buying Car: కారు కొనాలంటే ఈ సూత్రాన్ని పాటించాలి..లేదంటే నష్టపోతారు..
స్కూల్లో చదువుకునే రోజుల్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్ సొల్యూషన్ కావడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. అలాగే జీవితంలో ఆర్థికంగా ఎదగాలంటే కొన్ని ఫైనాన్స్ సూత్రాలు పాటించాలి.

Buying Car: ప్రతి ఒక్కరూ ఆనందమైన జీవితాన్ని కోరుకుంటారు. ఈ క్రమంలో సొంత ఇల్లు కొనుక్కున్న తరువాత వెంటనే ఓ కారు కొనాలనుకుంటారు. ఈరోజుల్లో ఫ్యామిలీ మెంబర్ష్ అంతా ఒకేసారి బస్సుల్లో వెళ్లడం సాధ్యం కావడం లేదు. దీంతో సొంతంగా వెహికల్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ప్రతీసారి అద్దె చెల్లించడం భారంగా మారుతుండడంతో సొంతంగా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే కారు కొనే వారకు బాగానే ఉంటుంది. ఒకవేళ రుణం ద్వారా కారు కొనుగోలు చేస్తే ఈఎంఐ చెల్లించేటప్పుడు బాధ కలుగుతుంది. మరి కారును ఎవరు కొనుగోలు చేయాలి? కారు కొనాలంటే ఒక వ్యక్తి జీతం ఎంత ఉండాలి? అందుకు ఏ సూత్రం పాటించాలి?
స్కూల్లో చదువుకునే రోజుల్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్ సొల్యూషన్ కావడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. అలాగే జీవితంలో ఆర్థికంగా ఎదగాలంటే కొన్ని ఫైనాన్స్ సూత్రాలు పాటించాలి. ఈ సూత్రాల ద్వారా ఆదాయాన్ని సమతుల్యం చేసుకోవాలి. కారు కొనాలంటే ఓ సూత్రాం పాటించాలని ఫైనాన్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సూత్రం ద్వారా జీతంలో వచ్చే ఆదాయాన్ని కారుకు కేటాయిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకుండా ఆర్థికంగా నష్టపోతారని అంటున్నారు.
20-4-10.. ఈ అంకెలు గోడ గడియారం మీది టైమ్ కాదు. కారు కొనాలనుకునేవారు పాటించే సూత్రం అని అంటున్నారు. ఇందులో 20 అనేది కారు డౌన్ పేమెంట్. అంటే కారు ఖరీదులో 20 శాతం డౌన్ పేమేంట్ ముందే చెల్లించాలి. 4 అనేది నాలుగు సంవత్సరాలకు మించి డ్రా చేసుకోకుండా ఉండాలి. ఇక వచ్చే జీతంలో 10 శాతం చెల్లించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ సూత్రం ప్రకారం కారును కొనుగోలు చేయాలి.
కారుకు సంబంధించి టెన్యూర్ ఎక్కువ రోజులు సెట్ చేసుకుంటే ఇబ్బందులు ఏర్పడుతాయి. అలాగని ఒకేసారి చెల్లించి కారు కొనుగోలు చేయాలనుకోవడం భావ్యం కాదు. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే ఒఖేసారి పేమెంట్ చేసి కారును కొనుగోలు చేయవచ్చు. కానీ జీతంపై ఆధారపడే వారు మాత్రం ఇలా సూత్ర ఆధారంగా కారును కొనుగోలు చేయాలి. అప్పుడు పర్సనల్ జీవితంపై ఎలాంటి ప్రభావం ఉండదు.
