
Google Search
Google Search: ప్రస్తుతం సాంకేతికత పెరిగింది. దీంతో ఏ విషయమైనా గూగుల్ లో వెతికితే దొరుకుతుంది. అన్ని విషయాలపై గూగుల్ మనకు అండగా నిలుస్తోంది. ఇదే మనకు శాపంగా మారుతోంది. ఒక కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లే కొన్ని విషయాలు మనకు మేలు చేసినా ప్రతికూలతలు కూడా చూపించడం కామనే. సమాజానికి హితం చేసేవి కాకుండా నాశనం చేసే అంశాలు కూడా దొరకడంతో వాటిని గురించి వెతికే వారికి కష్టాలు తప్పడం లేదు. సరదాకు మనం చేసే కొన్ని పనులు మనకు ప్రతిబంధకంగా మారుతాయి. ఈ క్రమంలో మనం అప్రమత్తంగా ఉండకపోతే అంతే సంగతి. మనకు అరదండాలు తప్పవు.
అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలి
దేశంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. సంఘ వ్యతిరేక పనులు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పొరపాటున కూడా మనం అసాంఘిక కార్యకలాపాల వైపు దృష్టి పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో చాలా మంది సరదాకు కొన్ని పనులు చేస్తూ చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. గూగుల్ ఉంది కదా అని ఏది పడితే అది సెర్చ్ చేస్తూ దొరికిపోతున్నారు. చివరకు కటకటాల పాలవుతున్నారు. మనం చేసే పనులు సమాజ హితానికి ఉపయోగపడాలి. కానీ సమాజ నాశనానికి కాదు.
బాంబుల తయారు కోసం..
కొంతమంది ఏదో హాస్యానికి బాంబుల తయారు కోసం గూగుల్ లో వెతుకుతున్నారు. దీంతో గూగుల్ లో సెర్చ్ చేస్తున్న వారి వివరాలు పోలీసులకు తెలిస్తే మన ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు. మనల్ని కటకటాల్లో పెడతారు. చేయని తప్పుకు బాధ్యులం కావాల్సి వస్తుంది. కానీ ఇంత తతంగం ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో వారు అడ్డంగా బుక్కవుతున్నారు. ఫలితంగా దేశద్రోహం కేసు కింద అరెస్టవుతున్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అందుకే పొరపాటున కూడా అలాంటి వాటిపై దృష్టి పెట్టడం సబబు కాదని తెలుసుకోవాలి.
గతంలో..
గతంలో పరిస్థితి వేరే ఉండేది. అప్పుడు ఇంతటి సాంకేతికత అందుబాటులో ఉండేది కాదు. దీంతో ప్రొఫెషనల్ మాత్రమే బాంబులు తయారు చేసే వారు. ఇప్పుడు అన్ని విషయాలు గూగుల్ లో దొరకడంతో ప్రతి వాడు బాంబులు తయారు చేయాలని కలలు కంటున్నాడు. దీంతో దొరికిపోతున్నారు. గూగుల్, ఇన్ స్ట్రాగ్రామ్, యూ ట్యూబ్ వంటి వాటిని ఉపయోగించుకుని బుక్కవుతున్నారు. నెట్లో పొరపాటున హౌ టు బాంబు తయారు అని కొడితే పోలీసులు ఇంటికే వచ్చి అదుపులోకి తీసుకుంటారు.

Google Search
మనం ఏం చేయాలి?
అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనకే ప్రమాదం. బాంబుల తయారు చేసేది మావోయిస్టులు, ఉగ్రవాదులు. మనకు వాటితో అవసరం లేదు. అంతమాత్రాన మనం వాటి గురించి తెలుసుకోవాలనుకోవడం అవివేకం. దీంతో మనకు అనేక చిక్కులు ఏర్పడతాయి. హైదరాబాద్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ వంటి రాష్ట్రాల్లో ఉగ్ర మూలాలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ చెబుతోంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున మనపై దేశద్రోహం నేరం కింద కేసు పెడితే మనం జీవితాంతం జైలులోనే ఉండాల్సి వస్తోంది. దీంతో బహుపరాక్. అప్రమత్తంగా ఉండండి. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా జరగండి.