Vishwak Sen- Arjun: హీరో విశ్వక్ సేన్-అర్జున్ సర్జా వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. విశ్వక్ సేన్ పై దర్శక నిర్మాతగా ఉన్న అర్జున్ నిర్మాతల మండలి లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై ఆరోపణలు చేశారు. నా కెరీర్ లో విశ్వక్ సేన్ లాంటి నిబద్ధత లేని నటుడిని చూడలేదు. అతనికి వృత్తి పట్ల గౌరవం లేదు. షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక క్యాన్సిల్ చేయాలని సందేశాలు పంపేవాడు. విశ్వక్ కోరిక మేరకు రెండు సార్లు షెడ్యూల్ వాయిదా వేశాను. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ కూడా క్రమశిక్షణతో ఉంటారు.

Vishwak Sen- Arjun
విశ్వక్ సేన్ ఒక అన్ ప్రొఫెషనల్ యాక్టర్. నాలా మరొకరు ఇబ్బంది పడకూడదు. అందుకే ఫిర్యాదు చేశాను, అని అర్జున్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అర్జున్ ఆరోపణలపై విశ్వక్ తాజాగా మరోసారి స్పందించారు. అర్జున్ వ్యాఖ్యలను విశ్వక్ సేన్ ఖండించారు. నేను చెప్పింది విన్నాక ఎవరిది తప్పో మీరే నిర్ణయించాలని విశ్వక్ తెలియజేశారు. కెరీర్ కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొని హీరోగా నిలదొక్కుకున్నాను. ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు. నా అంత కమిటెడ్ హీరో ఎవరూ ఉండరు.
ఈ ఏడాది నేను మూడు సినిమాలు చేశాను. ఏ ఒక్క డైరెక్టర్, నిర్మాత నా కారణంగా ఇబ్బంది పడలేదు. ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. నా సినిమాలకు పని చేసిన లైట్ బాయ్ నేను ప్రొఫెషనల్, కమిటెడ్ యాక్టర్ కాదని చెప్పినా సినిమాలు మానేస్తాను. సినిమా బాగా రావడం కోసం కలిసి మాట్లాడుకుందాం అని మెసేజ్ పెట్టాను. నన్ను నమ్ము సినిమా బాగా వస్తుందని అర్జున్ అనేవారు. అసలు ఏదీ మాట్లాడనిచ్చేవారు కాదు. నేను సినిమా నుండి తప్పుకోలేదు. ఆయనే ఒకరోజు తన మేనేజర్ ద్వారా అకౌంట్ డీటెయిల్స్ పంపించి రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేయమన్నారు. అర్జున్ సినిమా విషయంలో నాది తప్పు అని నిరూపిస్తే ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతా… అంటూ విశ్వక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Vishwak Sen- Arjun
అర్జున్-విశ్వక్ సేన్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు ఎవరిది తప్పు అనే చర్చ మొదలైంది. ఈ ఏడాది జూన్ లో అర్జున్ దర్సకత్వంలో విశ్వక్ సేన్ మూవీ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లంచ్ చేశాడు. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. అర్జున్ ఈ చిత్ర నిర్మాత కావడంతో పాటు ఆయన కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం చేయాలనుకున్నారు. విభేదాలతో ప్రాజెక్ట్ మొదలు కాకుండానే ఆగిపోయింది. ఇక విశ్వక్ కెరీర్లో పలు వివాదాలు ఎదుర్కొన్నారు. తాజాగా మరో వివాదంలో ఆయన పేరు వినిపిస్తోంది.