Bones : మన శరీరం ఎముకలతో నిర్మించబడింది. శరీర నిర్మాణంలో ఎముకల పాత్ర ముఖ్యమైనది. ఎముకలు దృఢంగా ఉంటేనే మన శరీరం బలంగా ఉంటుంది. అందుకే ఎముకలు మన శరీరానికి ఎంతో తోడ్పాటునందిస్తాయి. ఇటీవల కాలంలో ఎముకలు గుల్ల బారడం, ఎముకలు విరిగిపోవడం, అరిగిపోవడం వంటివి జరుగుతున్నాయి. ఎముకలు బలహీన పడటం, నొప్పులు రావడం, ఎముకలు దెబ్బతినడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మన ఆహార అలవాట్లు మనల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రక్తంలో ఆమ్లత్వం ఎక్కువగా పెరుగుతుంది. ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని పెంచడానికి కాల్షియం అవసరం.
మన శరీరానికి కాల్షియం తగినంత కావాలి. శరీరానికి ఎండ తగలకపోతే పోషకాలు అందవు. పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. కాల్షియం బాగా కావలంటే వెల్లుల్లి తీసుకుంటే మంచిది. వెల్లుల్లిని తినడం వల్ల ఎముకల దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అలిసిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. కాల్షియం, పాస్పరస్ ఎముకల కణాల్లోకి వెళ్లేలా చేస్తుంది. ఎముకలో దెబ్బతిన్న కణాలను బాగు చేయడానికి సాయపడుతుంది.
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎముకలకు ఎంతో ఉపయోగపడతాయి. వంటల్లో ఉపయోగించే వెల్లుల్లి వేడిలో వేయడం వల్ల దాని ఫలితం సరిగా ఉండదు. పచ్చి వెల్లుల్లి తీసుకుంటే ఎంతో ఉత్తమం. నూనె వేడిలో వెల్లుల్లి ఉడికి అందులో ఉండే మూలకాలు దెబ్బతింటాయి. ఎముకల దృఢత్వానికి వెల్లుల్లి మనకు ఎంతో లాభం కలిగిస్తుంది. ఎముకల సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది. దీంతో ఎముకల సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. రోజుకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే ఎముకలు బలంగా మారతాయి.
మన శరీరం ఎముకల గూడుతో నిర్మించబడింది. అందుకే ఎముకలు బలంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఎముకలు దృఢంగా మారడానికి మనం కొన్ని ఆహారాలు తీసుకోవాలి. ఎముకల కణజాలానికి ప్రొటీన్ బాగా పట్టాలంటే కాల్షియం కావాలి. ఎముకలు దెబ్బతింటే వాటిని బాగు చేయడానికి వెల్లుల్లి చక్కని పరిష్కారం చూపుతుంది. వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఎముకలు దృఢంగా మారడానికి సాయపడుతుంది. దీంతో ఎముకలకు బలం చేకూర్చే వెల్లుల్లిని రోజు తీసుకోవడం ఎంతో ఉత్తమం.