Sleep Tips: మనిషికి నిద్ర చాలా అవసరం. తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. జీవితంలో సగభాగం నిద్రకే పోతుందనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. సరైన నిద్రపోకపోతే రోగాలు చుట్టుముడతాయి. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు బాధిస్తాయి. నిద్ర పోవడానికి చాలా మంది రకరకాలుగా ప్రయత్నింటారు. కానీ నిద్ర పట్టడం లేదని వాపోతుంటారు. మంచి నిద్ర పోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తేసరి. నిద్ర మనిషికి ఎంతో అవసరం. అయితే కొందరికి ఎంతకీ నిద్ర పట్టదు. దీంతో వారు అనేక బాధలకు గురవుతుంటారు. జీవితంలో సక్రమంగా నిద్ర పడితేనే మన అవయవాలు కూడా సరిగా పనిచేస్తాయి. లేదంటే మొరాయిస్తాయి.

Sleep Tips
మంచి నిద్ర పట్టాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ఒత్తిడిని దూరం చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు తలుచుకోకూడదు. రోజు సాయంత్రం స్నానం చేయాలి. నిద్రకు ఉపక్రమించే ముందు ఎలాంటి కాఫీ, టీలు తాగకూడదు. గదిలో వెలుతురు ఉండకుండా జాగ్రత్త వహించాలి. సమతుల్య ఆహారం నిద్ర పోవడానికి రెండు గంటల ముందే తీసుకుంటే మంచిది. దీంతో మనం తిన్న ఆహారం త్వరంగా జీర్ణమై నిద్ర పడుతుంది. నిద్ర పట్టాలంటే ఏదైనా పుస్తకం చదివితే కూడా హాయిగా నిద్ర పడుతుంది.
రేపు చేయబోయే పనులు ఓ జాబితాలో రాసుకోవాలి. రాత్రుళ్లు సెల్ వాడకూడదు. మందంగా ఉండే దుప్పటి నిండుగా కప్పుకుంటే నిద్ర అదే వస్తుంది. ఏ రకమైన టెన్షన్లు పెట్టుకోవద్దు. ఇలా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే సుఖమైన నిద్ర పడుతుంది. మనసు కుదుటపడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే కచ్చితంగా నిద్ర పడుతుంది. దీంతో మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. తద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు.

Sleep Tips
మనిషికైనా జంతువుకైనా నిద్ర ప్రధానమే. విశ్రాంతి తీసుకోనిదే ఏ ప్రాణి ఉండదు. దీంతో మనకు విశ్రాంతి అనేది నిద్రలోనే లభిస్తుంది. అందుకే అందరు నిద్ర పోవాల్సిందే. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవడంతోనే మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. అవయవాలు కూడా బాగా పనిచేస్తాయి. దీంతో నూరేళ్లు హాయిగా జీవనం సాగించే అవకాశం ఏర్పడుతుంది. లేదంటే యాభై ఏళ్లకే టపా కట్టేయాల్సి వస్తుంది. దీంతో మనం రాత్రి పూట బాగా నిద్ర పోయేందుకు సరైన సమయం కేటాయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.