Diet : ప్రస్తుత కాలంలో మనం కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి. లేకపోతే మన ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. ఇటీవల కాలంలో మనం తినే ఆహారాల ప్రభావంతో అనారోగ్యాలు దరి చేరుతున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా లేకుండానే మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండెపోటు వంటి రోగాల బారిన పడుతున్నాం. దీనికి కారణం మన ఆహార శైలి అని తెలుసుకోవడం లేదు. పదేపదే కొన్ని ఆహారాలను తింటున్నాం. ఫలితంగా వ్యాధుల చెంత చేరుతున్నాం. అయినా మనలో ఇంకా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. దీని వల్ల భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం.
వేసవిలో..
వేసవిలో చాలా మంది ప్యాక్ డ్ జ్యూస్ లు ఇష్టపడుతుంటారు. వేడిని తట్టుకునేందుకు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇవి ఎంత ప్రమాదకరమో తెలుసుకోవడం లేదు. వీటిలో పురుగుల మందు కలుపుతారని తెలిసినా తాగకుండా ఉండలేకపోతున్నారు. ప్యాక్ డ్ జ్యూస్ రోజు తాగడం వల్ల అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే. వీటికి దూరంగా ఉంటేనే మంచిది. కానీ ఎవరు కూడా అలా చేయడం లేదు. కనిపిస్తే చాలు తాగుతున్నారు. ఫలితం కూడా అనుభవిస్తున్నారు.
డ్రై ఫ్రూట్స్
ఇవి మన శరీరానికి మంచివే. కానీ తక్కువ మోతాదులో తింటే సరి. ఎంత బంగారు కత్తి అయితే మాత్రం మెడ కోసుకుంటామా? మన శరీరానికి మంచి చేస్తాయని భావించి అధిక మొత్తంలో తీసుకుంటే ఎక్కువ కేలరీల శక్తి, కొలెస్ట్రాల్ అందుతుంది. దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని పరిమిత మోతాదులో తీసుకోవడమే ఉత్తమం. దొరికాయి కదా అని ఎడాపెడా లాగించి తరువాత వచ్చే పరిణామాలు ఎదుర్కోవడానికి కష్టపడటం ఎందుకు. ముందే జాగ్రత్త పడితే సరి.
క్యాబేజీ
క్యాబేజీ కుటుంబానికి చెందిన క్రూసిఫెరస్ ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. దీంతో శరీరంలో అయోడిన్ శాతం పెరుగుతుంది. దీని వల్ల హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది. ఇంకా బేకరీ ఫుడ్స్ కు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే అందులో ఉప్పు, నూనె, కారం అధిక మోతాదులో కలుపుతారు. వీటిని ఎక్కువగా తింటుంటే మనకు పలు రోగాలు వస్తాయి. అవి చుట్టు ముట్టాక తిప్పలు పడే బదులు ముందే వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం అని భావించుకోవాలి.
మాంసాహారాలు
మనలో చాలా మందికి జిహ్వ చాపల్యం ఉంటుంది. నోరూరుంచే వంటకాల్లో మాంసాహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో మాంసం ఉండాల్సిందే. లేదంటే ముద్ద దిగదు. నాన్ వెజ్ ఎక్కువగా తింటే అనర్థాలే. అందులో ఉండే ప్రొటీన్ వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఎప్పుడో నెలకోసారి తింటే సరే. కానీ నెలకు ఐదారు సార్లు తినడం వల్ల మనకు నష్టాలు కలుగుతాయి. అందుకే మాంసాహారాలకు కూడా ఎంత దూరం ఉంటే అంత మంచిది.
సిట్రస్ ఫుడ్స్
పులుపును అందించే పండ్లు తరచుగా తీసుకోకూడదు. ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది నిజమే. కానీ వీటిని కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఇష్టమొచ్చినట్లు తింటే ఇబ్బందులే. వీటిని రోజు తింటే ప్రశాంతత లోపిస్తుంది. మన జీర్ణ వ్యవస్థను బాగు చేసే ఆహారాల్లో కొంబుచ ఒకటి. దీన్ని కూడా ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు తీసుకోవడమే సురక్షితం. ఉప్పు కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. ఉప్పును కూడా స్వల్పంగా తీసుకోవడానికి మొగ్గు చూపితే మంచిది.