Goddess Lakshmi: ఈ 4 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో లక్ష్మీయోగం రావడం ఖాయమే?

Goddess Lakshmi: మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలని అందరు కోరుకుంటారు. ఆమె కోసం పూజలు చేస్తారు. వ్రతాలు ఆచరిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిచాలని చూస్తారు. లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. ఎప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుందో ఎవరికి తెలియదు. అందుకే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించి మన ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగించుకోవాలని భావించుకోవడంలో మనం తాపత్రయ పడటం సహజమే. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుందని ఎలా […]

  • Written By: Shankar
  • Published On:
Goddess Lakshmi: ఈ 4 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో లక్ష్మీయోగం రావడం ఖాయమే?

Goddess Lakshmi: మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలని అందరు కోరుకుంటారు. ఆమె కోసం పూజలు చేస్తారు. వ్రతాలు ఆచరిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిచాలని చూస్తారు. లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. ఎప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుందో ఎవరికి తెలియదు. అందుకే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించి మన ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగించుకోవాలని భావించుకోవడంలో మనం తాపత్రయ పడటం సహజమే.

లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుందని ఎలా తెలుస్తుంది. దానికి ఎలాంటి సంకేతాలు వస్తాయి. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా కొలువుండాలంటే ఏం చేయాలి? ఏ పరిహారాలు పాటించాలి? అనే విషయాలపై అందరికి సందేహాలు ఉంటాయి. ప్రాథమిక లక్షణం ఏమిటంటే పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువుంటుందని నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఎక్కడ కొలువుంటుంది. ధనలక్ష్మి మన ఇంట్లోనే ఉండాలంటే ఏం చేయాలనేదానిపై అందరు తర్జనభర్జన పడుతుంటారు.

లక్ష్మీదేవి 96 స్థానాల్లో ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి, కలశాలు, ఆవుపేడ, ఆవు కొమ్ముల మధ్య, పూజా మందిరం, పవిత్రమైన మనసు, దర్బలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సంచార బ్రాహ్మణులు, శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కావలంటే శుభ్రత పాటించాలి. 15 మంత్రాలు నిత్య పారాయణం చేయాలి.

Goddess Lakshmi

Goddess Lakshmi

ధనలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంటే మనకు కొన్ని సంకేతాలు వస్తాయి. కోయిల కూత వినడానికి ఎంత మధురంగా ఉంటుంది. కోయిల గానం కూడా మనకు ధనం వస్తుందని శుభ సూచకమే. కోయిల కూత శుభాలు సూచిస్తాయి. మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూస్తుంటే లక్ష్మీదేవి ఆగమనాన్ని తెలియజేస్తుంది. బల్లి మన కుడి చేతిపై పడితే మనం జీవితంలో పైకి ఎదగడం ఖాయం. మన ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే శుభం కలుగుతుందని అర్థం. చీమలు బియ్యాన్ని మోసుకుపోతున్నట్లు కనిపిస్తే ఎంతో మంచిది.

Tags

    follow us