Chanakya Neeti: చాణక్య నీతి: సిగ్గు బిడియం వదిలేసి శృంగారంలో భార్యాభర్తలు ఈ పనిచేస్తే ధనవంతులవుతారు
Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో గురువుగా పనిచేశారు. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో ఆయన వ్యూహాలు ఎన్నో ఉన్నాయి. అలా అతడు తన శక్తియుక్తులతో అద్భుతాలు సృష్టించాడు. ప్రపంచంలో మనుషుల మనస్తత్వాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కో తీరుగా ఉంటుంది. మనిషి ఎలా ఉండాలో చాణక్యుడు వివరించాడు. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఎలా వ్యవహరించాలనే దానిపై చాణక్యుడు వివరంగా చెప్పాడు. నాలుగు విషయాల్లో మొహమాటం అవసరం లేదని సూచించాడు. ఈ నాలుగు విషయాలు పాటిస్తే […]

Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో గురువుగా పనిచేశారు. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో ఆయన వ్యూహాలు ఎన్నో ఉన్నాయి. అలా అతడు తన శక్తియుక్తులతో అద్భుతాలు సృష్టించాడు. ప్రపంచంలో మనుషుల మనస్తత్వాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కో తీరుగా ఉంటుంది. మనిషి ఎలా ఉండాలో చాణక్యుడు వివరించాడు. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఎలా వ్యవహరించాలనే దానిపై చాణక్యుడు వివరంగా చెప్పాడు. నాలుగు విషయాల్లో మొహమాటం అవసరం లేదని సూచించాడు. ఈ నాలుగు విషయాలు పాటిస్తే జీవితం అద్భుతమే.
భార్యాభర్తల మధ్య..
భార్యాభర్తల మధ్య సిగ్గు ఉండకూడదు. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరగాలంటే స్నేహ సంబంధం ఉండాలి. శృంగారం విషయంలో కూడా ఎలాంటి దాపరికం ఉండకుండా చర్చించుకోవాలి. సిగ్గు పడితే పనులు కావు. సొంత విషయాల్లో ఇతరుల జోక్యం అవసరం లేదు. మన విషయాలు మనమే మాట్లాడుకోవాలి. అన్నం ముందు కూడా సిగ్గు పడితే కడుపు నిండదు. స్నేహితులు, బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు మొహమాటానికి పోయి సగం కడుపుకే తింటే నష్టాలే. గురుశిష్యుల మధ్య కూడా సిగ్గు ఉంటే పని కాదు. ఏ విషయంలోనైనా మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవు.
ధనమే అన్నిటికి మూలం
ప్రపంచమే డబ్బుతో నడుస్తోంది. ప్రతి విషయం డబ్బుతో ముడి పడి ఉంటోంది. ఈ నేపథ్యంలో డబ్బును వినియోగించడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు కావాల్సినప్పుడు మొహమాటపడకుండా అడగాలి. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు. డబ్బు అవసరం ఉంటే అడగటానికి ఇబ్బంది పడితే కుదరదు. బిడియం విడిచిపెట్టాలి. లేదంటే ముందుకు వెళ్లలేం. అందుకే డబ్బు అడిగేందుకు సిగ్గు పడితే మన చేతికి డబ్బు రాకుండా పోతుంది.
శృంగారంలో కూడా..
శృంగారం విషయంలో కూడా సిగ్గు పడితే ప్రయోజనం ఉండదు. శృంగారం సమయంలో సిగ్గు పడితే లాభం ఉండదు. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఇద్దరు ఎలా పాల్గొంటే భావప్రాప్తి కలుగుతుందో మాట్లాడుకుంటే సరి. లేకపోతే ఇబ్బందులే. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న విధంగా ముందుకు వెళ్లొచ్చు. ఈ విషయంలో ఇద్దరు సామరస్యంగా ఉంటే ఎన్నో రకాల లాభాలు కలగడం సహజం. ఇలా చాణక్యుడు సూచించినట్లు అవసరమైన సందర్భాల్లో బిడియ పడకుండా ఏం కావాలో అడిగి మరీ తీర్చుకోవడం ఉత్తమం.
