Pawan Kalyan- Chandrababu: పవన్ ఫోకస్ అయితే చంద్రబాబును వదిలేస్తారా?
చంద్రబాబు అరెస్టు తరువాత.. పవన్ మేనియా ఒకేసారి పెరిగింది. ఏపీ పాలిటిక్స్ లో మరోసారి పవన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఏపీ రాజకీయాలనే తన కంట్రోల్ కి తెచ్చుకోగలిగారు.

Pawan Kalyan- Chandrababu: చంద్రబాబు అరెస్టు తరువాత శరవేగంగా ఏపీ రాజకీయాలు మారాయి. ప్రజల్లో విపరీతమైన సానుభూతి వస్తుందని టిడిపి అనుకూల మీడియా చెబుతోంది. అటువంటిదేమీ లేదని నీలి మీడియా ప్రచారం చేస్తోంది. అటు చంద్రబాబుకు కోర్టుల్లో చుక్కెదురవుతోంది. మరోవైపు చంద్రబాబు పరామర్శకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఏకంగా పొత్తుల ప్రకటన చేశారు. అయితే ఈ తరుణంలో ఎవరికి వారే రాజకీయం మొదలుపెట్టారు. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప.. అటు జగన్, ఇటు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
చంద్రబాబు అరెస్టు తరువాత.. పవన్ మేనియా ఒకేసారి పెరిగింది. ఏపీ పాలిటిక్స్ లో మరోసారి పవన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఏపీ రాజకీయాలనే తన కంట్రోల్ కి తెచ్చుకోగలిగారు. కష్టంలో ఉన్న మిత్రుడికి సాయం చేస్తూనే యుద్ధం ప్రకటించారు. తద్వారా తెలుగుదేశం పార్టీకి ఒక ఆశాకిరణంగా మారిపోయారు. అప్పటివరకు పవన్ దోస్తీనే కోరుతూ సింహభాగం ప్రయోజనాన్ని కోరుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ ఆలోచనలో మార్పు రావడం ప్రారంభమైంది. ఎదురుగా బలమైన ప్రత్యర్థిని పెట్టుకుని.. చంద్రబాబు నేటి దుస్థితిని పరిగణలోకి తీసుకొని పవన్ కు సైతం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు ఎల్లో మీడియా హ్యాట్సాఫ్ చేస్తోంది.
అయితే ఇక్కడే వైసీపీ రాజకీయ వ్యూహం దాగి ఉంది. పవన్ బలంగా ఎదగడమేఇప్పుడు వారికి కావాలి.పవన్ వాయిస్ పెరిగిన మరుక్షణం చంద్రబాబుకు జైలు నుంచి ఉపశమనం లభిస్తుంది. చంద్రబాబు బయటకు వెళ్లిన తరువాత సీన్ మారుతుంది. అప్పటివరకు పవన్కు ఉన్న గ్రాఫ్ ని చంద్రబాబు వైపు తిప్పేలా ఎల్లో మీడియా వ్యూహరచన చేస్తుంది. అప్పుడు ఒక రకమైన గందరగోల పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడే టిడిపి,జనసేన పొత్తు పై వ్యతిరేక ప్రచారం చేసి మరింత అయోమయంలో పెట్టేయాలన్నది వైసిపి ప్లాన్. అందుకే పవన్ గ్రాఫ్ పెంచేంత వరకు రకరకాల కారణాలు చూపుతూ చంద్రబాబును రిమాండ్ లో ఉంచేందుకు వైసిపి పన్నాగం పన్నింది.
కానీ పవన్ ను ఇటువంటి చర్యలను ముందుగానే పసిగట్టారు. జగన్ వేసే ప్రతి అడుగును గమనించి పొత్తు అనే కీలక నిర్ణయం తీసుకున్నారు. సీట్లు, పవర్ షేరింగ్ అన్న షరతులు లేకుండా స్వచ్ఛందంగా పొత్తు నకు ముందుకు వచ్చి తానే ప్రకటించారు. జగన్ వ్యూహాన్ని ఆదిలోనే అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. తాను సైతం రాజకీయంగా యాక్టివ్ కాకుండా.. తిరిగి సినిమా షూటింగ్లలోకి వెళ్లిపోయారు. మరోవైపు లోకేష్ ను ఢిల్లీ పంపించారు. జాతీయస్థాయిలో జగన్ సర్కార్ చర్యలను ఎండగట్టేలా ప్లాన్ చేశారు. తమ వ్యూహాలకు ఎదురు దెబ్బ తగలడంతో జగన్ లో ఓ రకమైన నైరాశ్యం అలుముకుంది.
