Telangana Politics: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తెలంగాణలో ఎవరిది అధికారం?
పోల్ స్ట్రాటజీ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితికి 40 శాతం వరకు ఓట్లు వస్తాయని చెప్పింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడవసారి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు పోలవుతాయని లెక్క కట్టింది. భారతీయ జనతా పార్టీకి 16 శాతం వరకు ఓట్లు పడతాయని అంచనా వేసింది. ఇక ఇతరులు 10 శాతం వరకు ఓట్లు సాధిస్తారని స్పష్టం చేసింది. ఇక మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని పోల్ స్ట్రాటజీ నిర్వహించిన సర్వేలో 43 శాతం మంది ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడించారు.

Telangana Politics: చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. భారత రాష్ట్ర సమితి రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. జాతీయ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించింది. అయితే ఇప్పుడు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పదవి కాలం దాదాపుగా ముగిసేందుకు వచ్చింది. అంటే దాదాపుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించినట్టే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది డిసెంబర్ నాటికే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇటు మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భారత రాష్ట్ర సమితి యోచిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులకు రావాలని అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బిజెపి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. రాజకీయ పార్టీల విషయాన్ని పక్కన పెడితే ఎన్నికలకు సంబంధించి ప్రజల నాడిని కొన్ని కొన్ని సంస్థలు సర్వే చేస్తుంటాయి. అధికారంలోకి ఫలానా పార్టీ వస్తుందని తమ అంచనాగా చెబుతాయి. ఈ పరిస్థితుల మధ్య తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే ఓ సంస్థ తెలంగాణ రాజకీయాలపై సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారో తేల్చి చెప్పింది.
ఈ సర్వే నివేదిక ప్రకారం
పోల్ స్ట్రాటజీ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితికి 40 శాతం వరకు ఓట్లు వస్తాయని చెప్పింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడవసారి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు పోలవుతాయని లెక్క కట్టింది. భారతీయ జనతా పార్టీకి 16 శాతం వరకు ఓట్లు పడతాయని అంచనా వేసింది. ఇక ఇతరులు 10 శాతం వరకు ఓట్లు సాధిస్తారని స్పష్టం చేసింది. ఇక మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని పోల్ స్ట్రాటజీ నిర్వహించిన సర్వేలో 43 శాతం మంది ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని 29 శాతం మంది కోరుకున్నారు.. బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సీఎం అవ్వాలని నాలుగు శాతం మంది కోరుకున్నారు..
పాలనా పరంగా..
ఇక పాలనాపరంగా తెలంగాణలో 49 శాతం మంది ప్రజలు కేసీఆర్ పరిపాలనను మెచ్చుకున్నారు. ఆయన పాలన అద్భుతంగా ఉంటుందంటే ప్రశంసించారు. 20 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగాలేదని చెప్పారు. 13 శాతం మంది పరిపాలన విషయంలో మార్పులు జరగాలని కోరారు. తెలంగాణలో ప్రభుత్వం అధ్వానంగా ఉందని 15 శాతం మంది ప్రకటించారు. ఎటూ చెప్పలేమని మూడు శాతం మంది ప్రకటించారు. మరోవైపు ప్రతిపక్షాల గురించి సర్వే సంస్థ ఓటర్ల వద్ద ప్రస్తావించగా.. వారికి గతంలో పాలించిన అనుభవం లేదు కాబట్టి అంతగా మొగ్గు చూపలేమని ఓటర్లు ప్రకటించారు.
