Simhadri Re Release: సింహాద్రి రీ రిలీజ్ పబ్లిసిటీ కోసం 3 కోట్లు ఖర్చు చేస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ ఇంతేనా..!
పవన్ కళ్యాణ్ జల్సా, మరియు మహేష్ బాబు పోకిరి సినిమాలకు వచ్చిన వసూళ్లను ఇలాగే చేసారు. సింహాద్రి చిత్రాన్ని కూడా మంచి పని కోసమే రీ రిలీజ్ చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి కేవలం పబ్లిసిటీ కోసమే మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట.

Simhadri Re Release: ఈమధ్య రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ ట్రెండ్ ఇప్పుడు స్టార్ హీరోల అభిమానులకు చాలా ప్రెస్టీజియస్ గా మారింది. ఈ రీ రిలీజ్ ఈవెంట్స్ ని స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా, అభిమానుల ఆనందం కోసం చేస్తుంటారు. తద్వారా వచ్చిన డబ్బులను మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ జల్సా, మరియు మహేష్ బాబు పోకిరి సినిమాలకు వచ్చిన వసూళ్లను ఇలాగే చేసారు. సింహాద్రి చిత్రాన్ని కూడా మంచి పని కోసమే రీ రిలీజ్ చేస్తున్నారు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి కేవలం పబ్లిసిటీ కోసమే మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని అన్నీ ప్రాంతాలలో ప్రారంభించారు. కొత్త సినిమా విడుదల అయితే ఎలాంటి బుకింగ్స్ ఉంటాయో,అలాంటి బుకింగ్స్ ఈ చిత్రానికి కూడా ఉంటాయని అందరూ అంచనా వేశారు.
కానీ ఆ అంచనాలన్నీ ఇప్పుడు తలక్రిందులు అయ్యాయి. ఇప్పటి వరకు బుక్ మై షో మరియు పేటీఏం వంటి యాప్స్ ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. వైజాగ్ , హైదరాబాద్ మరియు విజయవాడ వంటి ప్రాంతాలలో ఒక్క టికెట్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో కదలడం లేదు. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది, ఆన్లైన్ ఫ్యాన్స్ ఈ చిత్రానికి నాన్ సింహాద్రి రికార్డ్స్ పెట్టబోతున్నాము కాచుకోండి అంటూ సవాళ్లు విసిరారు. కానీ ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఏమో కనీస స్థాయిలో కూడా లేదు, దీనితో నందమూరి ఫ్యాన్స్ మొత్తం డీలా పడ్డారు.
ఎన్టీఆర్ కెరీర్ లో మైలు రాయిలాంటి ‘సింహాద్రి’ సినిమాకి ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని ఊహించలేదని ,పుట్టినరోజు నాడు వెయ్యబడుతున్న సినిమా అయ్యినప్పటికీ కూడా బుకింగ్స్ స్పీడ్ లేకపోవడం వాళ్ళని ఎంతగానో బాధిస్తుంది, సినిమా విడుదలకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఈ నాలుగు రోజుల్లో బుక్స్ పికప్ అవుతాయో లేదో చూడాలి.
