Bigg Boss 7 Telugu: నీకు దగ్గరయ్యాను నా బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడేమో… తెరపైకి తేజా-శోభా ప్రైవేట్ చాట్!

శోభ లో కాస్త భయం మొదలైంది. ఎలిమినేషన్ భయం తో పాటు.. తన బాయ్ ఫ్రెండ్ ఆమెను వదిలేస్తాడేమోనని శోభా భయపడుతుంది.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu: నీకు దగ్గరయ్యాను నా బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడేమో… తెరపైకి తేజా-శోభా ప్రైవేట్ చాట్!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 లో శోభా ప్రవర్తన చూసి చాలా మంది ఆమె ఎలిమినెట్ అయిపోవాలి అని కోరుకుంటున్నారు. అంతలా నెగిటివిటీ తెచ్చుకుంది శోభ శెట్టి. టాస్క్ లో ఒడిపోయిన,కెప్టెన్సీ కంటెండర్ గా తీసేసినా, ఎవరైనా ఆమెను నామినేట్ చేసిన శోభా తట్టుకోలేదు. ఇక వాళ్ళని నోటికొచ్చినట్లు తిడుతూ .. అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది.గత వారం నామినేషన్స్ లో యావర్ ఇంకా భోలే తో గొడవ పడి ఆడియన్స్ దృష్టిలో వరెస్ట్ కంటెస్టెంట్ గా నిలిచింది. అయితే వీకెండ్ లో నాగార్జున గట్టిగానే క్లాస్ పీకారు.

దాంతో శోభ లో కాస్త భయం మొదలైంది. ఎలిమినేషన్ భయం తో పాటు.. తన బాయ్ ఫ్రెండ్ ఆమెను వదిలేస్తాడేమోనని శోభా భయపడుతుంది. ఈ విషయాన్ని తేజతో చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. శోభా, తేజ తో తను నన్ను వదిలేస్తే నేను తట్టుకోలేను అంటూ ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని తేజ అన్నాడు. దానికి శోభా ‘భయంగా ఉంది తేజ .. తనపై నాకు నమ్మకం ఉంది కానీ భయం కూడా ఉంది. నన్ను వాడు బాగా అర్థం చేసుకుంటాడు.

కానీ ఒకవేళ ఏదైనా నేను వాడికి నచ్చనట్టుగా బిహేవ్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో మెంటాలిటీ ఉంటుంది. చెప్పలేం ఇదంతా చూసి వాడు ఏమైన నిర్ణయం తీసుకోవచ్చు కదా తేజ అంటూ శోభా అంది. నీతో కలిసి ఉండటం అతనికి నచ్చకపోవచ్చు ఎవరికి తెలుసు అని చెప్పింది. దాంతో తేజ ‘నేనో కామెడీ పీస్ గాడిని నీ మైండ్ లో నుంచి అది తీసెయ్ అన్నాడు.

అది కాదు తేజ నాకు వచ్చిన లెటర్ ఏదో తేడాగా ఉంది. వాడు కంప్లీట్ గా మా మమ్మీ చెప్పినట్లు రాసి పంపించాడు. లాస్ట్ లో స్ట్రాంగ్ గా ఉండు బుజ్జి అని మాత్రమే రాసాడు. ఏమి జరగదు అని నమ్మకమైతే ఉంది.బై మిస్టేక్ ఏదైనా జరిగితే తట్టుకోలేను. అతన్ని మర్చిపోలేను. ఇదంతా ఫన్ కోసమే చేస్తున్న. కానీ అతనికి వేరేలా అర్థం అయితే.. నేను తట్టుకోలేను. అతను బాగా గుర్తొస్తున్నాడు అంటూ భోరున ఏడ్చింది శోభాశెట్టి. కాగా ఈ వారం కూడా శోభా శెట్టి ఓటింగ్ లో వెనుకబడినట్లు సమాచారం.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు