Heroine Aamani: అతడిని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నాను : హీరోయిన్ ఆమని
అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చెయ్యకుండా, నటనకి అధిక ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ కెరీర్ లో ఇంత దూరం వచ్చింది.

Heroine Aamani: మన టాలీవుడ్ లో అందాల ఆరబోతకు ఏమాత్రం తావు ఇవ్వకుండా, చక్కటి సంసార పక్షమైన పాత్రలు పోషించే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ‘ఆమని’. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘జంబలకడిపంబ’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఆమని, తొలి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో అవకాశాలు ఆమె కోసం క్యూ కట్టాయి.
అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చెయ్యకుండా, నటనకి అధిక ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ కెరీర్ లో ఇంత దూరం వచ్చింది. ఇప్పటికి కూడా ఈమె క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న నటిగా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే హీరోయిన్ గా మరో పదేళ్ల పాటు కొనసాగే సత్తా ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవడం వల్ల ఆ కెరీర్ మొత్తం నాశనం అయ్యిందని ‘ఆమని’ బాధపడుతూ ఉంటుందట.
రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి చేసిన కొన్ని కీలకమైన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసారు. తల్లిదండ్రుల మాట కాదనలేక నేను కూడా పెళ్ళికి ఒప్పేసుకున్నాను. పెళ్లి చేసుకునే ముందు నా భర్త కొన్ని షరతులు పెట్టాడు. అందులో మొదటిది పెళ్ళయాక సినిమాలు మానేయడం, దీనికి నేను వెంటనే ఒప్పుకున్నాను. అప్పట్లో నాతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద బ్యానర్స్ మరియు స్టార్ హీరోలు రెడీ గా ఉన్నారని తెలిసినా కూడా తృణప్రాయం లో కెరీర్ ని వదిలేసుకున్నాను. ఆ తర్వాత కెరీర్ ని వదిలినందుకు ఎంతో బాధపడ్డాను. అసలు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు మానేయమంటే నేను ఎలా ఒప్పుకున్నాను అని ప్రతీ రోజు బాధపడేదానిని.ఈ పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను అని అనుకునే దానిని. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఇవన్నీ మర్చిపోయాను. వాళ్ళే లోకం లాగ బ్రతికాను, ఆ తర్వాత కొన్నాళ్ళకు సినిమాల్లో నటించే అవకాశం వస్తే నా భర్త ని అడిగాను, అప్పుడు మాత్రం ఆయన సపోర్టు గా నిలిచాడు’ అంటూ చెప్పుకొచ్చింది ఆమని.
