KTR Tweet On NDTV: జాతీయ ఛానెల్ ఎన్డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్) ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ వశం అయింది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇకపై ఆ ఛానెల్ చూడబోనని స్పష్టం చేశారు. ఎన్డీటీవీని అన్ ఫాలో చేస్తున్నానని ట్వీట్ చేశారు. ఇందుకు ఎన్డీటీవీ డైరెక్టర్‌గా ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికారాయ్ దిగిపోయారని ఏఎన్‌ఐ వార్త సంస్థ రాసిన కథనాన్ని ట్యాగ్ చేశారు. ఇప్పటిదాకా ఎన్డీటీవీలో మంచి వార్తలు ప్రసారం చేశారని కేటీ ఆర్ కొనియాడారు.

KTR
అదానీ గ్రూప్ అధికారిక టేకోవర్..
విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ఆగస్టులోనే ప్రకటించింది. ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్‌ఆర్‌ఆర్ హోల్డింగ్ సోమవారం తన ఈక్విటీ క్యాపిటల్‌లో 99.5 శాతాన్ని అదానీ గ్రూప్ యాజమాన్యంలోని విశ్వప్రదాన్ కమర్షియల్స్‌కి బదిలీ చేసింది, తద్వారా ఎన్డీటీవీ అధికారిక కొనుగోలును అదానీ గ్రూప్ పూర్తి చేసింది.
అదానీ ప్లాన్ ఏంటి?
ఓడరేవు, విమానాశ్రయం, మౌలిక సదుపాయాలు, ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ నుంచి అనేక రంగాలలో వ్యాపారం చేయడం గతంలో పెద్ద, ప్రసిద్ధ కొనుగోలు చేయడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచారు. కొంతమంది మాత్రం ఇదంతా ఎన్డీటీవీ మేనేజ్‌మెంట్ ఇష్టానికి వ్యతిరేకంగా స్వాధీనం చేసుకున్నారని విమర్శిస్తున్నారు. అయితే, గౌతమ్ అదానీ ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్డీటీవీ ఒప్పందం గురించి మాట్లాడుతూ, ‘‘ఫైనాన్షియల్ టైమ్స్‌తో పోటీపడే ఛానెల్ మన దేశంలో లేదు. మీడియా హౌస్‌కు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు? దానిని స్వతంత్రంగా ఎందుకు చేయకూడదు. ఇండిపెండెంట్ అంటే ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అనాలి, కానీ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తున్నప్పుడు దానిని బహిరంగంగా చెప్పే ధైర్యం కూడా ఉండాలి’’ అని అన్నారు.

NDTV
బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని..
అదానీ, అంబానీలకు కేంద్రం కొమ్ముకాస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లతోపాటు కనీస అర్హత లేని నాయకులలు కూడా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.. తమ పార్టీ అధినేత, ముఖ్యమైన మంత్రి తానా అంటే క్యాడర్ తందానా అనడం టీఆర్‌ఎస్‌లో సాధారణమే. ఈ క్రమంలో జాతీయస్థాయిలో మంచి రేటింగ్ ఉన్న ఎన్డీటీవీని అదాని టే కోవర్ చేయడం ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్ నేతలకు మింగుడు పడని అంశం. ఈ నేపథ్యంలో అధానీ ఆధ్వర్యంలో ఎన్డీటీపీ ఇకపై పారదర్శక వార్తలు రాయదని ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో కేటీఆర్ అన్‌ఫాలో చేస్తున్నట్లు ట్వీట్ చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.