Anasuya Bharadwaj: కులం కూడా తెలియదు, పెళ్ళికి ముందు 8ఏళ్ళు సహజీవనం చేశా… అనసూయ బోల్డ్ కామెంట్స్

అనసూయ సుశాంక్ భరద్వాజ్ ని వివాహం చేసుకుంది. అతడితో అనసూయ 8ఏళ్ళు సహజీవనం చేసిందట. పెళ్లి అయ్యే వరకు కూడా సుశాంక్ భరద్వాజ్ తనకు మధ్య కుల ప్రస్తావన రాలేదట.

  • Written By: Shiva
  • Published On:
Anasuya Bharadwaj: కులం కూడా తెలియదు, పెళ్ళికి ముందు 8ఏళ్ళు సహజీవనం చేశా… అనసూయ బోల్డ్ కామెంట్స్

Anasuya Bharadwaj: అనసూయ రూటే సపరేట్. ఆమెది బోల్డ్ యాటిట్యూడ్. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్లు ఉంటుంది. డ్రెస్సింగ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నెగిటివ్ కామెంట్స్. అసలు పట్టించుకోదు. పైగా తన హేటర్స్ కుళ్ళుకునేలా పోస్ట్స్ పెడుతుంటుంది. తాజాగా ఆమె ఓ షాకింగ్ సీక్రెట్ బయటపెట్టారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసినట్లు అనసూయ చెప్పి అందరి మైండ్స్ బ్లాక్ చేశారు.

అనసూయ సుశాంక్ భరద్వాజ్ ని వివాహం చేసుకుంది. అతడితో అనసూయ 8ఏళ్ళు సహజీవనం చేసిందట. పెళ్లి అయ్యే వరకు కూడా సుశాంక్ భరద్వాజ్ తనకు మధ్య కుల ప్రస్తావన రాలేదట. ఒకరికి మరొకరి కులం గురించి తెలియదట. పెళ్లి కుదిరాక కొన్ని కార్యక్రమాల్లో భాగంగా తెలుసుకోవాల్సి వచ్చిందట. సుశాంక్ బిహార్ కి చెందినవాడు కాగా వాళ్ళ సాంప్రదాయాలు భిన్నంగా ఉండేవట. వాటిని అలవర్చుకోవడానికి మొదట్లో కొంత ఇబ్బంది పడ్డానని అనసూయ అన్నారు.

ఒంటికి నిండుగా బట్టలు ధరించాలి. భోజనం చేసేటప్పుడు తలపై కొంగు ఉండాలనే వారట. అయితే మెల్లగా ఇరు కుటుంబాల మధ్య అవగాహన కుదిరింది. వాళ్ళ మైండ్స్ నేను మార్చేశాను అన్నారు. వాళ్ళ మైండ్స్ నేను వాష్ చేశానని అనసూయ చెప్పుకొచ్చారు. కాగా అనసూయ స్కూల్ డేస్ లో ఓ ఎన్ సీ సీ క్యాంప్ కి వెళ్లగా అక్కడ భరద్వాజ్ పరిచమయ్యాడు. అలా మొదలైన ప్రేమ ఏళ్ల తరబడి సాగింది.

సుశాంక్ తో అనసూయ పేరెంట్స్ పెళ్ళికి ఒప్పుకోలేదు. దాంతో ఇంటి నుండి బయటకు వచ్చేసింది. తల్లిదండ్రులు ఒప్పుకునే వరకు అనసూయ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేదు. 2010లో అనసూయ వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. జబర్దస్త్ షో ఆమె జీవితం మార్చేసింది. ప్రస్తుతం బిజీ యాక్ట్రెస్ అయ్యారు. ఆమె కీలక రోల్ చేసిన పెదకాపు చిత్రం సెప్టెంబర్ 29న విడుదల కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు