Niharika Konidela: నేను పోగొట్టుకున్న బంగారం తో ఓ ఇల్లు కట్టుకోవచ్చు: నిహారిక

నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా మెగా అభిమానులు ఆదరించలేకపోయారు. దీంతో ఈమె నటించిన సినిమాలకు పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయింది నిహారిక.

  • Written By: Suresh
  • Published On:
Niharika Konidela: నేను పోగొట్టుకున్న బంగారం తో ఓ ఇల్లు కట్టుకోవచ్చు: నిహారిక

Niharika Konidela: నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా ఇంటి కూతురిగా అభిమానులను సంపాదించింది. చిత్ర పరిశ్రమలో యాంకర్, హీరోయిన్, నిర్మాతగా కొనసాగుతూ తన టాలెంట్ ను చూపించింది అమ్మడు. పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా కొనసాగింది అమ్మడు. మెగా బ్రదర్ నాగబాబు కూమార్తెగా ఈమె బుల్లితెరపై యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తన మాట తీరుతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. యాంకర్ గా తన ప్రస్థానం కొనసాగిస్తూనే హీరోయిన్ గా కూడా కొనసాగింది మెగా డాటర్.

నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా మెగా అభిమానులు ఆదరించలేకపోయారు. దీంతో ఈమె నటించిన సినిమాలకు పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయింది నిహారిక. దీంతో కుటుంబ సభ్యులు ఈమెకు జొన్నలగడ్డ చైతన్య అనే అబ్బాయికి ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేశారు. ఈ వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయి ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఇక భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక కెరియర్ పై ఫోకస్ పెట్టారు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో భాగంగా మీరు ఫస్ట్ టైం ఎప్పుడు మేకప్ వేసుకున్నారు అంటూ ప్రశ్నించగా ఢీ షో కే మొదటి మేకప్ వేసుకున్నానని తెలిపింది నిహారిక. ఈ షో నాకు ఇప్పటికీ మెమోరబుల్ అంటూ ఈమె కామెంట్ చేశారు. మీరు ఎప్పుడైనా ఖరీదైన వస్తువులను పోగొట్టుకున్నారా అనే ప్రశ్న ఎదురవగా అందులో మనమే ముందంటూ తాను పొగొట్టుకున్న వస్తువుల గురించి వివరించింది మెగా డాటర్. ఈమె సమాధానం విని నెటిజన్లు షాక్ అవుతున్నారు.

చిన్నప్పుడు తనకు అమ్మ తనకోసం ఎన్నో రకాల డిజైన్ నగలను తెచ్చి పెట్టేదట. నేను వాటిని చాలా ఎక్కువగా పోగొట్టానని ఈ సందర్భంగా నిహారిక తెలిపింది. చిన్నప్పుడు చాలా బంగారం పోగొట్టుకున్నానని.. నేను పోగొట్టుకున్న బంగారం తో ఒక ఇల్లు కట్టుకోవచ్చని తెలిపింది మెగా డాటర్. అయితే చిన్నప్పుడు తను పెద్దగా తెలిసేది కాదని అసలు తాను పెట్టుకున్న నగలు ఉన్నాయో లేదో కూడా గమనించుకొనేది కాదట. ఇలా ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు