Aishwarya Rajesh: నా సినిమాకు నేనే హీరో, స్టార్స్ ఆఫర్స్ ఇవ్వకపోతే ఏంటీ… ఐశ్వర్య రాజేష్ షాకింగ్ ఆరోపణలు

హీరోయిన్ ఆఫర్ ఇచ్చేముందు అనేక విషయాలు చూస్తారు. ఆమె మార్కెట్, పాపులారిటీ, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. మనం ఆశించిన స్థానానికి వెళ్లాలంటే దేనికైనా రెడీగా ఉండాలి. అందుకే నేను లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నాను. 15 చిత్రాల వరకు లేడీ ఓరియెంటెడ్ చేశాను. అయినా నాకు పెద్ద హీరోలు ఆఫర్స్ ఇవ్వడం లేదు. దానికి కారణం కూడా నాకు తెలియదు. అయినా పర్లేదు. నా సినిమాలకు నేనే హీరో. నాకంటూ అభిమానులు ఉన్నారని డేరింగ్ కామెంట్స్ చేశారు.

  • Written By: Shiva
  • Published On:
Aishwarya Rajesh: నా సినిమాకు నేనే హీరో, స్టార్స్ ఆఫర్స్ ఇవ్వకపోతే ఏంటీ… ఐశ్వర్య రాజేష్ షాకింగ్ ఆరోపణలు

Aishwarya Rajesh: పరిశ్రమలో లౌక్యం అవసరం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ధైర్యం ఎవరూ చేయరు. అలా చేస్తే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని భయపడతారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అందుకు భిన్నంగా ఉన్నారు. ఆమె మనసులో ఉన్న భావాలు ఓపెన్ గా కుండబద్దలు కొడుతున్నారు. తాజాగా ఆమె సౌత్ ఇండియా స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టార్స్ నాకు అవకాశాలు ఇవ్వకపోయినా పర్లేదు. నా సినిమాలకు నేనే హీరో అంటూ ముక్కుసూటిగా మాట్లాడారు.

విషయంలోకి వెళితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ స్టార్స్ పక్కన నటించే అవకాశం రానందుకు అసహనం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ… కాక ముట్టై విడుదల తర్వాత నాకు అవకాశాలు రాలేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు స్టార్ హీరోలు ఛాన్సులు ఇవ్వడం లేదు. ధనుష్, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, శివ కార్తికేయన్ మాత్రమే నాకు అవకాశాలు ఇచ్చారు.

హీరోయిన్ ఆఫర్ ఇచ్చేముందు అనేక విషయాలు చూస్తారు. ఆమె మార్కెట్, పాపులారిటీ, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. మనం ఆశించిన స్థానానికి వెళ్లాలంటే దేనికైనా రెడీగా ఉండాలి. అందుకే నేను లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నాను. 15 చిత్రాల వరకు లేడీ ఓరియెంటెడ్ చేశాను. అయినా నాకు పెద్ద హీరోలు ఆఫర్స్ ఇవ్వడం లేదు. దానికి కారణం కూడా నాకు తెలియదు. అయినా పర్లేదు. నా సినిమాలకు నేనే హీరో. నాకంటూ అభిమానులు ఉన్నారని డేరింగ్ కామెంట్స్ చేశారు.

ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి. వాళ్ళ నాన్న రాజేష్ ఒకప్పటి నటుడు. చిన్న వయసులోనే మరణించాడు. లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి మేనత్త అవుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐశ్వర్య రాజేష్ ప్రస్థానం మొదలైంది. రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన రాంబంటు మూవీలో పాప రోల్ చేసింది. తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో విజయ్ దేవరకొండ భార్యగా నటించింది. ఐశ్వర్య రాజేష్ అన్నయ్యలు ప్రమాదంలో కన్నుమూశారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు