Anchor Pradeep: స్టార్ యాంకర్ ప్రదీప్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన వన్ అండ్ ఓన్లీ మేల్ యాంకర్ అని చెప్పొచ్చు. ఆ కేటగిరీలో ప్రదీప్ కి పోటీ లేదు. దశాబ్దానికి పైగా ప్రదీప్ ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు. కెరీర్ జోరుగా ఉండగా… ఎఫైర్, పెళ్లి వార్తలు ఆయన్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఆయన మ్యారేజ్ ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. ఇటీవల ప్రదీప్ మ్యారేజ్ న్యూస్ మరోసారి హైలెట్ అయ్యింది. ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతు అనే అమ్మాయిని ప్రేమించిన ప్రదీప్ వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ప్రదీప్ స్వయంగా స్పందించారు.

Anchor Pradeep
ఓ ప్రముఖ టెలివిజన్ ఛానల్ లో మాట్లాడిన ప్రదీప్ ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదన్నారు. నవ్య మారోతు కాదు కదా నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు అన్నారు. నాకు ఆ తరహా రిలేషన్ లేవు. కేవలం టెలివిజన్ షోస్ తో నేను రిలేషన్ లో ఉన్నాను. అంతే కానీ నేను ఎవరినీ ప్రేమించలేదు. పెళ్లి చేసుకోబోవడం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం నా ఫోకస్ పూర్తిగా కెరీర్ మీదే ఉందన్నారు. మీ గోల్ ఏమిటని అడగ్గా. జనాలను ఎంటర్టైన్ చేయడమే తన అల్టిమేట్ గోల్ అన్నారు. ప్రదీప్ స్క్రీన్ పై కనిపిస్తే మనోడు వచ్చాడు అనుకోవాలి. ఎంటర్టైన్ చేశాడన్న భావన కలగాలి అన్నారు.
మరో సినిమా ఎప్పుడు చేస్తున్నారని రిపోర్టర్ అడిగారు. చర్చలు జరుగుతున్నాయి. బెటర్ సబ్జెక్టు ఎంపిక చేసే పనిలో ఉన్నాను , అన్నారు. కాగా ప్రదీప్ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీ విడుదలైంది. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? పర్లేదు అనిపించుకుంది. ఆ సినిమా విడుదలై రెండేళ్లు అవుతుండగా మరో చిత్రం ప్రకటించలేదు. ఈ విషయంలో ప్రదీప్ కంటే సుధీర్ జోరు చూపిస్తున్నాడు. గాలోడు మూవీతో సుధీర్ హిట్ కొట్టాడు .

Anchor Pradeep
39 ఏళ్ల ప్రదీప్ ఇంకెప్పుడు వివాహం చేసుకుంటాడో చూడాలి. కాగా గతంలో ప్రదీప్ పెళ్లి చూపులు ఓ షోగా ప్రసారమైంది. ప్రదీప్ ని వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉన్న కొందరు అమ్మాయి పెళ్లి చూపులు షోలో పాల్గొన్నారు. సుమ యాంకర్ గా వ్యవహరించారు. పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన ప్రదీప్ పెళ్లి చూపులు షో అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.