Deepika Pilli- Hyper Aadi: దీపికా పిల్లిపై కన్నేసిన హైపర్ ఆది… కిళ్లీలా నమిలేయాలని ఉందని కోరిక బయటపెట్టిన బుల్లితెర స్టార్

గతంలో దీపికా పిల్లి ఢీ సీజన్ 13 చేశారు. అప్పుడు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ప్రదీప్, రష్మీ గౌతమ్ యాంకర్స్ గా ఉన్నారు. సోషల్ మీడియా సెలబ్రెటీగా ఉన్న దీపికా పిల్లి ఢీ షోలో ఎంట్రీ ఇవ్వడం సంచలనమైంది. ఆ సీజన్లో దీపికా పిల్లి ఆదితో రొమాన్స్ చేసింది. రష్మీ-సుధీర్ ఒక జంటగా, దీపికా పిల్లి-హైపర్ ఆది మరొక జంటగా ఎంటర్టైన్ చేశారు. కారణం ఏమిటో కానీ సీజన్ 14 నుండి దీపికా, సుధీర్, రష్మీలను తొలగించారు.

  • Written By: Raj Shekar
  • Published On:
Deepika Pilli- Hyper Aadi: దీపికా పిల్లిపై కన్నేసిన హైపర్ ఆది… కిళ్లీలా నమిలేయాలని ఉందని కోరిక బయటపెట్టిన బుల్లితెర స్టార్

Deepika Pilli- Hyper Aadi: డాన్స్ రియాలిటీ షోలలో ఢీ రారాజు అని చెప్పొచ్చు. దశాబ్దన్నర కాలంగా ఈటీవీలో ఢీ డాన్స్ షో ప్రస్థానం కొనసాగుతుంది. తాజాగా ఢీ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. కొత్త టీమ్స్ సత్తా చాటుతున్నాయి. శేఖర్ మాస్టర్, హీరోయిన్ పూర్ణ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఇక యాంకర్స్ గా హైపర్ ఆది, ప్రదీప్ రంగంలోకి దిగారు. అనూహ్యంగా దీపికా పిల్లి ఈ సీజన్లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ యంగ్ బ్యూటీ ఢీ ప్రీమియర్ యాంకర్ గా సందడి చేయనుంది.

గతంలో దీపికా పిల్లి ఢీ సీజన్ 13 చేశారు. అప్పుడు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ప్రదీప్, రష్మీ గౌతమ్ యాంకర్స్ గా ఉన్నారు. సోషల్ మీడియా సెలబ్రెటీగా ఉన్న దీపికా పిల్లి ఢీ షోలో ఎంట్రీ ఇవ్వడం సంచలనమైంది. ఆ సీజన్లో దీపికా పిల్లి ఆదితో రొమాన్స్ చేసింది. రష్మీ-సుధీర్ ఒక జంటగా, దీపికా పిల్లి-హైపర్ ఆది మరొక జంటగా ఎంటర్టైన్ చేశారు. కారణం ఏమిటో కానీ సీజన్ 14 నుండి దీపికా, సుధీర్, రష్మీలను తొలగించారు.

ఢీ ప్రీమియర్ లీగ్ తో దీపికా రీఎంట్రీ ఇచ్చింది. ఈ డాన్స్ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. లుంగీలో హైపర్ ఆది, బాడీ కాన్ డ్రెస్ లో దీపికా పిల్లి ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలోని ‘కిళ్ళీ కిళ్ళీ…. నమిలాక బాగున్నదే నాగమల్లీ” సాంగ్ వేశారు. దీపికా, హైపర్ ఆది ఈ సాంగ్ కి స్టెప్స్ వేశారు. సాంగ్ ముగిశాక ‘వన్స్ మనం ఫిక్స్ అయ్యాక కిళ్ళీ అయినా పిల్లీ అయినా నమిలేయడమే’ అన్నాడు. ఆ మాటకు ఛీ అని దీపికా పిల్లి అసహ్య భావన వ్యక్తం చేసింది. జడ్జెస్ పక్కున నవ్వేశారు.

ఇక చాలా కాలం తర్వాత మల్లెమాల షోకి చమ్మక్ చంద్ర వచ్చాడు. ఆయన్ని చూసిన దీపికా పిల్లి ‘బాబాయ్ గారూ ఆశీర్వదించండి’ అంటూ కాళ్లకు మొక్కింది. హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, దీపికా పిల్లి వేసిన కామెడీ స్కిట్ నవ్వులు పూయించింది. నెక్స్ట్ ఢీ ప్రీమియర్ ఎపిసోడ్ అదిరిపోయే పెర్ఫార్మన్స్ లతో పాటు, కామెడీ, రొమాన్స్ తో అలరించనుంది. అయితే రష్మీ, సుధీర్ లేకపోవడం లోటని చెప్పొచ్చు. దీపికా పిల్లికి మంచి అవకాశం.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు