Cannes Film Festival 2023: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మెరిసిన హైదరాబాద్ సుధారెడ్డి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌గా గుర్తింపు పొందిన మెగా కంపెనీ చైర్మన్‌ కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి. సుధారెడ్డి చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలు, చారిటీ పనులే ఆమెకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

  • Written By: DRS
  • Published On:
Cannes Film Festival 2023: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మెరిసిన హైదరాబాద్ సుధారెడ్డి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Cannes Film Festival 2023: ప్రతిష్టాత్మకమైన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌–2023 వేదికపై హైదరాబాద్‌ నగరానికి చెందిన బిజినెస్‌ టైకూన్‌ సుధారెడ్డి సందడి చేశారు. తొలిసారిగా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో గ్లామర్‌తో అలరించారు. ప్రఖ్యాత డైరెక్టర్‌ మార్టిన్‌ స్క్రోసేస్, హాలీవుడ్‌ నటుడు లియోనార్డో డికాప్రియో చిత్రం ‘కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌’ నేషనల్‌ ప్రీమియర్‌లో భాగంగా ఆమె రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేశారు. స్టార్‌–స్టడెడ్‌ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రముఖులతో అలరించే రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేసిన మొట్టమొదటి సిని మాయేతర సెలబ్రిటీ సుధారెడ్డి కావడం విశేషం. ఎవరీ సుధారెడ్డి.. ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటి అన్న చర్చ జరుగుతోంది. సుధారరెడ్డి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు సెర్చ్‌ చేస్తున్నారు.

మెగా కృష్ణారెడ్డి సతీమణి..
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌గా గుర్తింపు పొందిన మెగా కంపెనీ చైర్మన్‌ కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి. సుధారెడ్డి చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలు, చారిటీ పనులే ఆమెకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాయి. గతంలో పలు అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికలపై కూడా సుధారెడ్డి తళుక్కుమన్నారు. తాజాగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అవకాశం లభించింది. దీర్ఘకాలంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన ఫౌండేషన్స్‌తో కలిసి పనిచేసేందుకు ఇదొక చక్కటి అవకాశంగా సుధారెడ్డి భావిస్తున్నారు.

ప్రత్యేక చీరలో..
ఈ సందర్భంగా ఆమె కస్టమ్‌ మేడ్‌ ఫల్గుణి షేన్‌ కాక్‌ పీచ్‌ పెర్ల్‌ డ్రెప్‌ చీరలో ఆకట్టుకున్నారు. ఫాక్స్‌ లెదర్‌ హ్యాండ్‌ గ్లవ్స్‌ ధరించి వెర్‌సేస్‌ బ్రాండ్‌ హ్యాండ్‌ పర్స్‌తో కనిపించారు. ఇక రాబర్ట్‌ కావాలీస్‌ స్ప్రింగ్‌ 2013 కలెక్షన్‌ నుంచి జ్యువెలరీ ధరించారు. రెడ్‌ కార్పెట్‌ పై అడుగుపెట్టగానే కెమెరాలన్నీ క్లిక్‌మన్నాయి. అనంతరం ప్రతిష్టాత్మకమైన బీచ్‌ డెస్టినేషన్, ప్లేజ్‌ హోటల్‌ బారియర్‌ లే మెజెస్టిక్‌ లో జరిగిన మేడమ్‌ ఫిగరో ఈవెంట్లో తళుక్కుమన్నారు. ఆమె ధరించిన డైమండ్‌ నెక్లెస్‌ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ డైమండ్‌ నెక్లెస్‌ 115.90 కారట్స్‌ బరువుటుంది.కొద్ది పాటి మేకప్, వెనక్కు అందంగా కట్టిన హెయిర్‌స్టయిల్‌తో మీర్జాపూర్‌ యువరాణిలా కనిపించారు.

తొలి నాన్‌ సినిమా సెలబ్రిటీగా..
ఇదంతా అటుంచితే ఫ్యాషన్‌ రంగంలో హైదరాబాద్‌ను ఖండాతరాలకు చేర్చిన ఘనత సుధారెడ్డికే దక్కుతుంది. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ నుంచి అటెండ్‌ అయిన తొలి నాన్‌ సినిమా సెలబ్రిటీగా సుధారెడ్డి గుర్తింపు పొందారు. రెడ్‌ కార్పెట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా సెలబ్రిటీలకే ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే సుధారెడ్డి చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలు, చారిటీ పనులే ఆమెకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీర్ఘకాలంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన ఫౌండేషన్స్‌తో కలిసి పనిచేసేందుకు ఇదొక చక్కటి అవకాశంగా భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు