ఢిల్లీ అల్లర్ల వెనుక హైద్రాబాద్ హ్యాష్ ట్యాగ్స్ ఇవే..!

ఢిల్లీలో 4రోజుల పాటు జరిగిన అల్లర్లలో హైదరాబాద్ యువత పాత్ర ఉందంటున్నారు కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు. హైదరాబాద్ కి చెందిన కొందరు విద్యార్థులు ఉద్యేశపూర్వకంగా సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేయడం ద్వార ఢిల్లీలో అల్లర్లకు ఆజ్యం పోశారని తాజాగా కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సమర్పించిన రహస్య నివేదికలో వెల్లడించారు. ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సమయంలో హైదరాబాద్ లో కొందరు విద్యార్థులు ప్రత్యేక హాష్ ట్యాగ్‌లతో కూడిన మెసేజ్ లను పోస్టు […]

  • Written By: Neelambaram
  • Published On:
ఢిల్లీ అల్లర్ల వెనుక హైద్రాబాద్ హ్యాష్ ట్యాగ్స్ ఇవే..!

ఢిల్లీలో 4రోజుల పాటు జరిగిన అల్లర్లలో హైదరాబాద్ యువత పాత్ర ఉందంటున్నారు కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు. హైదరాబాద్ కి చెందిన కొందరు విద్యార్థులు ఉద్యేశపూర్వకంగా సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేయడం ద్వార ఢిల్లీలో అల్లర్లకు ఆజ్యం పోశారని తాజాగా కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు కేంద్ర హోంమంత్రిత్వశాఖకు సమర్పించిన రహస్య నివేదికలో వెల్లడించారు.

ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సమయంలో హైదరాబాద్ లో కొందరు విద్యార్థులు ప్రత్యేక హాష్ ట్యాగ్‌లతో కూడిన మెసేజ్ లను పోస్టు చేశారని ఇంటలిజెన్స్ పేర్కొంది. ముఖ్యంగా ఢిల్లీ క్లాషెస్, ఢిల్లీ క్లాషెస్2020, ఢిల్లీ రియోట్స్, ఢిల్లీజెనోసిడ్, షహీన్‌బాగ్, ఢిల్లీ పోలీసు, మర్డర్స్, జస్టిస్ ఫర్ ఫైజాన్, ఆప్ షరం కరో, అమిత్ షా రిజైన్, అమిత్ షా ఇస్తేఫా దో, గోబ్యాక్ అమిత్ షా తదితర హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేశారని ఇంటలిజెన్స్ తన నివేదికలో వెల్లడించింది.

తప్పుడు, ఫొటోస్, తప్పుడు వీడియోలు, వదంతులు, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి వ్యాప్తి చేయడం ద్వార ఢిల్లీలో అల్లర్లు జరిగాయని గూఢాచారి విభాగం తన నివేదికలో తెలిపింది. అల్లర్ల వ్యాప్తికి హైదరాబాద్ విద్యార్థులను ఉపయోగించారని తేల్చారు.

ఢిల్లీలో అల్లర్లు చెలరేగాడు పాకిస్థాన్ అధికారిక ట్విట్టర్ కూడా ఉపయోగపడింది అని గూఢాచారి వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసుల చేతిలో ఫైజాన్ మరణించాడని, జస్టిస్ ఫర్ ఫైజాన్ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వైద్యచికిత్స చేయించకుండా పోలీసు కస్టడీలో ఉంచినందునే ఫైజాన్ మరణించాడని పోస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు హంతకులని పోస్టులు పెట్టారు.కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, ఢిల్లీలో ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాల్లో దాడులపై దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, కపిల్ మిశ్రాలను పోలీసులు అరెస్టు చేయాలని కూడా కొందరు పోస్టులు పెట్టారు. క్రూరమైన, రాజ్యాంగ విరుద్ధమైన సీఏఏను వెనక్కి తీసుకోండి అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హైదరాబాద్ విద్యార్థులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే ఢిల్లీలో అల్లర్లకు కారణమైందని కేంద్ర ఇంటలిజెన్స్ తన రహస్య నివేదికలో పేర్కొనడం హైదరాబాద్ లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా యాప్ లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.