Hrithik Roshan Birthday : బర్త్ డే లుక్ తో షేక్ చేసిన హృతిక్‌ !

  Hrithik Roshan Birthday  :  బాలీవుడ్‌ లో ఎందరు స్టార్లు ఉన్నా.. హృతిక్‌  రోషన్‌ స్థాయి వేరు, అతనికి ఉన్న స్టార్ డమ్ వేరు. సినిమా హిట్ అయితే స్టార్లు అవుతారు.  కానీ తన సినిమాలు వరుసగా  ప్లాప్ అయినా  హృతిక్  మాత్రం  స్టార్ గానే ఉంటాడు. అందుకే   స్టార్‌ హీరోకి పర్యాయపదం,  గ్రీక్‌ గాడ్‌ కి మారు రూపంగా   హృతిక్ నిలిచిపోయాడు.  కాగా  జనవరి 10న హృతిక్‌ పుట్టిన రోజు.  హృతిక్‌ పుట్టిన రోజు సందర్భంగా   ‘విక్రమ్‌ వేద’ హీందీ రీమెక్‌  లో  ఆయన […]

Hrithik Roshan Birthday :  బర్త్ డే  లుక్ తో షేక్ చేసిన  హృతిక్‌   !

 

Hrithik Roshan Birthday  :  బాలీవుడ్‌ లో ఎందరు స్టార్లు ఉన్నా.. హృతిక్‌  రోషన్‌ స్థాయి వేరు, అతనికి ఉన్న స్టార్ డమ్ వేరు. సినిమా హిట్ అయితే స్టార్లు అవుతారు.  కానీ తన సినిమాలు వరుసగా  ప్లాప్ అయినా  హృతిక్  మాత్రం  స్టార్ గానే ఉంటాడు. అందుకే   స్టార్‌ హీరోకి పర్యాయపదం,  గ్రీక్‌ గాడ్‌ కి మారు రూపంగా   హృతిక్ నిలిచిపోయాడు.  కాగా  జనవరి 10న హృతిక్‌ పుట్టిన రోజు.  హృతిక్‌ పుట్టిన రోజు సందర్భంగా   ‘విక్రమ్‌ వేద’ హీందీ రీమెక్‌  లో  ఆయన పాత్రను ప్రేక్షకులకు  గ్రాండ్ గా  పరిచయం చేశారు మేకర్స్‌. 

  ‘విక్రమ్‌ వేద’ హీందీ రీమెక్‌ లో  హృతిక్‌ రోషన్‌ ఫస్ట్‌ లుక్‌ అదిరిపోయింది. లుక్  విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే నేషనల్ వైడ్ గా ఈ లుక్ తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా  ఈ ఫస్ట్ లుక్‌ లో హృతిక్‌  చాలా  రఫ్‌ లుక్‌ లో కనిపించాడు. పైగా హృతిక్ గెటప్ కూడా చాలా అట్రాక్టీవ్‌ గా ఉంది.  ఒక్కసారిగా    ‘విక్రమ్‌ వేద’  ఫస్ట్  లుక్ లో  వింటేజ్ హృతిక్   కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్లు కూడా ఈ ఫస్ట్  లుక్ పోస్టర్ ను తెగ షేర్ అండ్ లైక్స్ తో హడావిడి చేస్తున్నారు.     

 

ఇక  లుక్ లో  హృతిక్ స్టైల్ విషయానికి వస్తే.. అలా  నల్లని కళ్లద్దాలతో  నల్లటి కుర్తాలో  రక్తంతో తడిసిన ‘వేద’గా హృతిక్ అద్భుతంగా ఉన్నాడు.  మెయిన్ గా  హృతిక్  గడ్డం కూడా పాత్రకు  పర్ఫెక్ట్  గా  సెట్ అయింది.  మొత్తమ్మీద చిత్రబృందం వేద  పాత్రను  బాగా  పరిచయం చేశారు. అన్నట్టు  ఈ సినిమాను తమిళలో రూపొందించిన దర్శకుడు పుష్కర్‌ గాయత్రి ఈ హిందీ రీమెక్‌ కు  కూడా  డైరెక్షన్‌ చేస్తుండటం విశేషం.   

Image

కాగా  ఈ సినిమాలో మాధవన్‌ నటించిన  విక్రమ్‌ రోల్‌ లో సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తుండగా…  ఇక మెయిన్ క్యారెక్టర్ లో హృతిక్ నటిస్తున్నాడు.   ఏది ఏమైనా  హృతిక్‌ బర్త్‌డే స్పెషల్‌ ట్రీట్‌ అదిరింది.  కాగా ఈ సినిమాలో  రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో నటిస్తుంది.    ‘విక్రమ్‌ వేద’  ఒర్జినల్ వెర్షన్ లో  స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి, మాధవన్‌ కలిసి నటించారు.  ‘విక్రమ్‌ వేద’ హిందీలో  విజయ్ సేతుపతి పాత్రలోనే  హృతిక్ కనిపించబోతున్నాడు.