‘ఖైదీ’ లో చాన్స్ దక్కేదెవరికీ?

తమిళ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ మూవీ తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీని బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో కార్తీ స్థానంలో నటించేందుకు హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేల్ కనకరాజే హిందీలోనూ దర్శకత్వం వహించనున్నారు. ఖైదీ రీమేక్ మూవీలో హృతిక్ రోషన్ నటించబోతున్నారనే వార్తలు విన్పిస్తున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్ నటించిన సూపర్ […]

  • Written By: Neelambaram
  • Published On:
‘ఖైదీ’ లో చాన్స్ దక్కేదెవరికీ?

తమిళ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ మూవీ తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీని బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో కార్తీ స్థానంలో నటించేందుకు హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేల్ కనకరాజే హిందీలోనూ దర్శకత్వం వహించనున్నారు.

ఖైదీ రీమేక్ మూవీలో హృతిక్ రోషన్ నటించబోతున్నారనే వార్తలు విన్పిస్తున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30, వార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఈ మూవీల తర్వాత హృతిక్ నుంచి మరేవీ సినిమాలు రాకపోవడంతో ‘ఖైదీ’ మూవీలో హృతిక్ నటిస్తాడనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి హృతిక్ రోషన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. హృతిక్ లాగానే రణవీర్ సింగ్ కూడా ‘ఖైదీ’ మూవీలో నటిస్తారని వార్తలు విన్పిస్తున్నాయి. కార్తీక్ స్థానంలో రణవీర్ సింగ్ చేస్తే బాగుంటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. దీనిపై రణవీర్ సింగ్ ను సంప్రదించగా సానుకూలంగా స్పందించారని సమాచారం.

‘ఖైదీ’లో కార్తీ నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించారు. తెలుగులో హిట్టయిన మూవీలు బాలీవుడ్లో రీమేక్ కావడం సర్వసాధారణంగా మారింది. ఈ కోవలోనే ఖైదీ మూవీ బాలీవుడ్ బాట పట్టింది. తమిళంలో దర్శకత్వం వహించిన కనకరాజ్ హిందీలోనూ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ మూవీకి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో నటించేందుకు పోటీపడుతున్న రణవీర్ సింగ్, హృతిక్ రోషన్ లలో ఎవరికీ అవకాశం దక్కుతుందో తెలియడంలేదు. మొత్తానికి దక్షిణాది ‘ఖైదీ’ ఉత్తరాదిన హల్ చల్ చేయబోతున్నాడు.

సంబంధిత వార్తలు