Beer: ఆరోగ్యం విషయంలో చాలా మంది మనల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. కొందరు బీరు తాగడం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుందని చెబుతుంటారు. బీరులో అల్కహాల్ పర్సంటేజీ తక్కువగా ఉంటుందని అంటారు. కానీ అందులో నిజం లేదు. విషం ఎంతైనా నష్టమే. దాన్ని తీసుకోవడం వల్ల మన శరీరం అనేక రోగాలకు మూలంగా నిలుస్తుంది. కానీ ఎవరు కూడా ఊరుకోరు. అల్కహాల్ తీసుకోకుండా ఉండలేరు. దీంతో మన శరీరం రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని ఫలితంగా మృత్యువు ఒడిలోకి వెళ్లడం ఖాయం.

Beer
బీరు ఎలా తాగాలి?
బీరును ఎలా తాగాలనేదానిపై మనకు కొంత క్లారిటీ ఇచ్చారు. ఇది తాగేవారి విషయంలోనే. ఇతరులకు కాదు. మన శరీరంలో అల్కహాల్ పరిమాణం పెరిగిందంటే ప్రమాదకరమే. సాధారణంగా ఒక బీరులో 650 ఎంఎల్ ఉంటుంది. ఇందులో కంపెనీల స్థాయిని బట్టి 4-10 శాతం మధ్యలో అల్కహాల్ పర్సంటేజీలు మిళితమై ఉంటాయి. అల్కహాల్ పర్సంటేజీ పెరిగే కొద్ది లివర్ హ్యాండిల్ చేసే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా 4-10 మ్య ఉండే బీరు తాగినప్పుడు 355 ఎంఎల్ వరకు మాత్రమే మన లివర్ తీసుకుంటుంది. అంతకంటే మించితే లివర్ కు ఇబ్బందిగా మారుతుంది.
ఎంత పరిమాణంలో తాగాలి?
355 ఎంఎల్ తీసుకుంటే మరొక 300 ఎంఎల్ మన లోపలకు వెళ్లినట్లు అవుతుంది. దీన్ని లివర్ క్లియర్ చేసుకునేందుకు సరిపోతుంది. కానీ అంతకంటే ఎక్కువ పరిమాణం తీసుకుంటే లివర్ కు కష్టంగా అవుతుంది. దీంతో లివర్ డ్యామేజీ కావడం ప్రారంభం అవుతుంది. ఇలా రోజురోజుకు లివర్ ప్రభావం తగ్గిపోతే మనిషి మనుగడ కష్టం. మద్యం తీసుకునే వారు నియంత్రణలో ఉండరు. ఒక బీరు తాగిన తరువాత మరోటి కావాలని మారాం చేస్తారు. దీంతో వాటి సంఖ్య పెరుగుతుంది. ఆరోగ్యం నాశనం అవుతుంది.

Beer
లివర్ కు ఎంత నష్టం..
ఒక బీరు తాగితే 650 ఎంఎల్ పరిమానం లోపలకు వెళ్తుంది. దీంతో 200 కిలో కేలరీల శక్తి వస్తుంది. అదే 100 ఎంఎల్ బీరు తీసుకుంటే 4-8 గ్రాముల పిండి పదార్థాలు, కార్బోహైడ్రేడ్లు లభిస్తాయి. 4-10 శాతం అల్కహాల్ 100 ఎంఎల్ బీరులో ఉంటుంది. దీంతో మన శరీరానికి అందే ఉపయోగాలు ఏమీ ఉండవు. కానీ లివర్ మాత్రం 355 ఎంఎల్ పరిమాణం దాటి తాగితే జీర్ణించుకో లేదు. ఈ క్రమంలో లివర్ మెల్లమెల్లగా పాడవుతుంది. లివర్ దెబ్బతింటే మనిషి జీవితం సమాప్తం అయినట్లే.
అల్కహాల్ అత్యంత ప్రమాదకరం
మనిషికి అల్కహాల్ అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. రాత్రి సమయంలో శరీరం చేసుకునే డీటాక్సిఫికేషన్ కు ఇబ్బంది కలుగుతుంది. మత్తు మన హార్మోన్ల పనితీరును మందగిస్తుంది. దీంతో శరీరానికి అనేక రకాల నష్టాలు కలుగుతాయి. నిదానంగా మన శరీరాన్ని నాశనం చేయడంలో అల్కహాల్ ప్రభావం చూపుతుంది. అందుకే మద్యం తీసుకోవడం మంచిదికాదని చెబుతున్నా పట్టించుకునే వారు లేరు. తమ దేహంలో అల్కహాల్ స్థాయిలను పెంచుకుంటూ క్రమంగా ఆరోగ్యానికి చేటు చేసుకుంటున్నారు.