Bunny: అల్లు అర్జున్ ముందు ఉన్న ప్రస్తుత మెయిన్ టార్గెట్.. తాను పాన్ ఇండియా స్టార్ అని అనిపించుకోవడమే. తనకు తాను ఐకాన్ స్టార్ అని ఒక బిరుదు తగిలించుకుని మొత్తానికి తెలుగులో బాగానే ప్రమోట్ చేసుకుంటున్న బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తనను తానూ ప్రమోట్ చేసుకోవడానికి ఓ ప్రత్యేక టీమ్ ను పెట్టుకున్నాడు. ఈ టీమ్ చేసే పని ఒక్కటే. అల్లు అర్జున్ అనగానే పాన్ ఇండియా టాప్ హీరోల్లో ఒకడిగా చూపించాలి.
అలా చూపించాలి అంటే.. ముందు గూగుల్ ను నమ్మించాలి. అలా నమ్మించడానికి ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి. ఎలాగూ బన్నీ హీరోగా రాబోతున్న పుష్ప వచ్చే నెలలో విడుదల కాబోతుంది. నిజానికి ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి పాన్ ఇండియా సినిమా అంటూ నిత్యం అనేక వార్తలు రాయించుకుంటూ ప్రత్యేక యాడ్స్ ఇస్తూ బన్నీ టీమ్ బాగా కష్టపడుతుంది.
అయితే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. సోషల్ మీడియాను హ్యాండిల్ చేసినంత మాత్రాన పాన్ ఇండియా స్టార్ అయిపోతాడా ? ఇప్పటి వరకూ పాన్ ఇండియా స్టార్ గా కేవలం ఇద్దరికీ మాత్రమే క్రెడిట్ వచ్చింది. ఒక్కటి ప్రభాస్, రెండు యశ్. నిజానికి యశ్ కి గుర్తింపు మాత్రమే దక్కింది. ఇంకా మార్కెట్ క్రియేట్ అవ్వలేదు. అలాంటిది హిందీ లాంటి మిగిలిన భాషల్లో గుర్తింపు కూడా లేని బన్నీ ఎలా పాన్ ఇండియా స్టార్ అవుతాడు ?
పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకుడు. సుకుమార్ మంచి దర్శకుడే. కానీ పుస్తకాలు చూసి స్క్రిప్ట్ లు రాసుకునే దర్శకుడు. పైగా కమర్షియల్ గా భారీ సక్సెస్ లు లేని దర్శకుడు. ఒక్క రంగస్థలం తప్ప, సుకుమార్ కెరీర్ లో చెప్పుకోతగ్గ సినిమానే లేదు. ఇది పరిస్థితి ? ఇలాంటి డైరెక్టర్ తో మిగిలిన భాషల్లో కనీస మార్కెట్ కూడా లేని సినిమా ఎలా పాన్ ఇండియా సినిమా అవుతుంది ?
Also Read: Padma Awards 2021: సామాన్యులే సాధించేశారు.. పద్మశ్రీ అవార్డు గ్రహీతల విజయగాథ ఇదీ..
సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలి అంటే.. కనీసం అయిదు భాషల్లో విడుదల చేయాలి. కానీ హిందీ వర్షన్ ను స్కిప్ చేస్తున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే హిందీలో పుష్పను విడుదల చేసినా కనీస కలెక్షన్స్ రావు అనేది పుష్ప టీమ్ కే అనుమానం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక పాన్ ఇండియా ఎలా అవుతుంది బన్నీ ?
Also Read: Akhanda: ‘అఖండ’లో ఊపు లేదు.. మళ్ళీ అదొక సమస్యనా ?