Drink Water: పరిగడుపున ఎంత నీరు తాగాలి.. దాంతో లాభాలేంటి?

Drink Water: మనకు నీరు అవసరం. రోజు ఆహారం తీసుకోకుండా ఉండలేమో కానీ నీరు తాగకుండా ఉండలేం. ప్రతి రోజు మనం కనీసం ఐదారు లీటర్ల నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉంటాం. కానీ మనలో ఎంత మంది ఈ మోతాదులో తాగుతున్నారు? ఎందరు తాగునీరుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? తాగునీరుపై దృష్టి పెట్టడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నీరు తాగకపోతే మన శరీరం పలు సమస్యలకు గురవుతుంది. అయినా మనం నీరు తాగే విషయంలో శ్రద్ధ […]

  • Written By: Shankar
  • Published On:
Drink Water:  పరిగడుపున ఎంత నీరు తాగాలి.. దాంతో లాభాలేంటి?

Drink Water: మనకు నీరు అవసరం. రోజు ఆహారం తీసుకోకుండా ఉండలేమో కానీ నీరు తాగకుండా ఉండలేం. ప్రతి రోజు మనం కనీసం ఐదారు లీటర్ల నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉంటాం. కానీ మనలో ఎంత మంది ఈ మోతాదులో తాగుతున్నారు? ఎందరు తాగునీరుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? తాగునీరుపై దృష్టి పెట్టడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నీరు తాగకపోతే మన శరీరం పలు సమస్యలకు గురవుతుంది. అయినా మనం నీరు తాగే విషయంలో శ్రద్ధ పెట్టడం లేదు. ఫలితంగా మనకు కష్టాలు వస్తున్నాయి.

ఎంత నీరు తాగాలి?

ప్రతి రోజు మనం ఎంత నీరు తాగాలి అనే దానిపై ఆరోగ్య నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. రోజుకు మగవారైతే 5-6 లీటర్లు, ఆడవారైతే 4-5 లీటర్ల నీరు తాగాలి. కానీ మనలో ఎంత మంది ఇంత నీరు తాగుతున్నాం. నీరు మనకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే లీటర్ పావు నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. దాదాపు 25 శాతం జబ్బులు రాకుండా ఉండటానికి ఉదయం పూట మనం తాగే నీరు సాయడుతుంది. ఇది మనం చెప్పే విషయం కాదు. జపాన్ వారు 75 వేల మందిపై పదిహేనేళ్లు పరిశోధన చేసి చెప్పారు.

Drink Water

Drink Water

ఎంత మందిపై పరిశోధన

ఉదయం పూట నీరు తాగే వారిని 75 వేల మంది, నీరు తాగని వారిని 75 వేల మందిని తీసుకుని పరిశోధన చేశారు. ఉదయం పూట నీరు తాగే వారిలో 25 శాతం రోగాలు రాకుండా పోయాయి. దీంతో నీరు ఎంత ఆధారంగా నిలుస్తుందో గమనించాలి. ఉదయం నీరు తాగడం వల్ల మూత్రం సాఫీగా వస్తుంది. మలవిసర్జనలో కూడా ఇబ్బందులు రావు. కడుపులో పేరుకుపోయిన మలం మొత్తం బయటకు వచ్చేందుకు దోహదపడుతుంది. ఇలా తాగేనీరుతో మనకు ఎన్నో లాభాలున్నాయని గుర్తుంచుకోవాలి.

సర్వరోగ నివారిణిగా..

తాగేనీరు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. ఉదయం పూట లీటరు పావు నీటితో పాటు మరికొంత సమయం తీసుకుని మరో లీటర్ పావు తాగాలి. ఇలా రెండున్నర లీటర్ల నీరు ఉదయం సమయంలో తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. నీరే అన్నింటికి ప్రాణాధారమని తెలుసు. జంతువులు, పక్షులు కూడా నీరు తాగకుండా ఉండలేవు. ఇలా నీరు మనకు ఎన్నో లాభాలు కలిగిస్తుంది. ఈ విషయాలు తెలుసుకుని ఉదయం నీరు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

Tags

    follow us