Avatar Director James Cameron: పుష్కర కాలం కిందట వచ్చిన అవతార్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో.. తెర నిండుగా పండోరా గ్రహం, కన్నుల విందుగా దృశ్యాలు, తమ తరాన్ని కాపాడుకునేందుకు గ్రహాంతరవాసుల పోరాటాలు, పండోరా గ్రహంలో లభించే అరుదైన ఖనిజాల కోసం అమెరికన్ సైనికులు సాగించే ధమనకాండ.. ఇలా ఒకటేమిటి అవతార్ సినిమా ద్వారా జేమ్స్ కామెరున్ సృష్టించిన అద్భుతాలు ఎన్నో. అవతార్ సినిమా మూడు పార్ట్స్ గా వస్తుందని కామెరున్ అప్పుడే చెప్పారు. దాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఇన్నాళ్ల సమయం తీసుకున్నారు. ఇటీవల విడుదలైన అవతార్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Avatar Director James Cameron
..
4కే ఫార్మాట్లోకి మార్చి
..
ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అవతార్ సినిమాని ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా 4కె లోకి మార్చారు. బహుశా ప్రపంచ సినిమాలో దేనికి లేనంతగా హై రిజల్యూషన్ తో తీర్చిదిద్దారు. దానిని ఇవ్వాలా ( సెప్టెంబర్ 23) విడుదల చేశారు. 2009 డిసెంబర్ 18న 1196 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం పూర్తి చేసుకున్న అవతార్ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 13,555 కోట్లను వసూలు చేసింది. అవతార్ సినిమా దెబ్బకు అప్పటిదాకా ఉన్న సినిమా రికార్డులన్నీ బద్దలైపోయాయి. అవతార్ సినిమా కథను 1994 లోనే కామెరూన్ రాసుకున్నారు. 1997లో తాను తీసిన టైటానిక్ తర్వాత ఈ సినిమా కథతో పలు నిర్మాణ సంస్థలను సంప్రదించినా వారు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈ సినిమాలో విజువల్ వండర్స్ కు భారీ ఎత్తున ఖర్చు అవుతుండడంతో దానిని భరించలేమని వారు చేసి చెప్పేశారు. కానీ అప్పటికే టైటానిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయ ఢంకా మోగించింది. దీంతో కామెరున్ పట్టుదలతో ఈ సినిమాను ప్రారంభించారు. అవతార్ సినిమాకి ప్రధాన బలం పండోరా గ్రహం. దానిని రూపొందించేందుకు చైనాలోని పలు ప్రాంతాలను కామెరూన్ సందర్శించారు. వాటిని యధావిధిగా రూపొందించేందుకు కామెరూన్ చాలా కష్టపడ్డారు. పండోరా గ్రహంలో గ్రహాంతరవాసులు మాట్లాడే నేవీ భాషను పాల్ ప్రామర్ సృష్టించారు. ఇందులో వెయ్యి పదాలు ఉంటాయి. 2007 ఏప్రిల్ లో అవతార్ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇందులో 40 శాతం షూటింగ్ లైవ్ లొకేషన్ లో తీశారు. మిగతా 60 శాతం షూటింగ్ ను ఫోటో రియలిస్టిక్ సీజే తో పూర్తి చేశారు. ఇందుకోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడారు. నటీనటులను వారి పాత్రల్లో నటించేలా ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. హువేవీ లోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ట్రెక్కింగ్ ఇప్పించారు. కేవలం అవతార్ సినిమా కోసమే పదివేల చదరపు అడుగుల స్థలంలో నాలుగువేల సర్వర్లను అమర్చారు. 35 వేల ప్రాసెసర్ కోర్ల తో సర్వర్ ఫామ్ ను ఏర్పాటు చేశారు. అవుట్ పుట్ స్టోర్ చేయడానికి మూడు పెటా బైట్ల డాటా(30 లక్షల జీబీ) ఉపయోగించారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీ వాడారు. సంగీతం కోసం కంపోజర్ జేమ్స్ హార్నర్ కొత్త సంగీత వాయిద్యాలను సృష్టించారు. అవతార్ సినిమా ఆస్కార్ అవార్డుల కోసం 9 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఉత్తమ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించినందుకు జేమ్స్ కామెరూన్ 350 మిలియన్ డాలర్ల పారితోషకాన్ని తీసుకున్నారు.

Avatar
…
మూడు సీక్వెల్స్
..
అవతార్ సినిమాను మూడు స్వీకెల్స్ గా తీస్తున్నారు. అవతార్ దీ వే ఆఫ్ వాటర్ డిసెంబరు 16న, అవతార్ 3 ని 2026లో, అవతార్ 4 ని 2028లో విడుదల చేయనున్నారు.