Mumbai Indians IPL 2023: ఐపీఎల్ తో ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి ఎంత ఆదాయం వచ్చిందంటే..!
ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు ఉన్నారు. ఐపీఎల్ లో ఎక్కువ మంది స్పాన్సర్లు కలిగిన చెట్టు కూడా ఇదే కావడం గమనార్హం. ది ట్రిబ్యూన్ ప్రకారం ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూషన్ రూ.10,070 కోట్లకుపైమాటే. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం దాదాపు రూ.200 కోట్లు మేర పెరిగింది. ఇప్పటి వరకు అత్యంత లాభదాయకమైన జట్టు కూడా ముంబై ఇండియన్స్. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా వృద్ధిని నమోదు చేసిన ఏకైక జట్టు ఇదే కావడం విశేషం.

Mumbai Indians IPL 2023: ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లోను అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటి వరకు మరో జట్టుకు సాధ్యం కాని విధంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిళ్లను ఈ జట్టు గెలుచుకుంది. ఈ ఏడాది కూడా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి సెమీఫైనల్ వరకూ చేరుకోవడంతో.. ముంబై జట్టు ఫైనల్ కు రావడం లాంచనమే అని అంతా భావించారు. చెన్నై, ముంబై జట్లు ఫైనల్ ఆడతాయని అంతా లెక్కలు వేసుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్ లో అనూహ్యంగా ముంబై జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఆ జట్టుకు ఏర్పడింది. ఐపీఎల్ లో ఒక్కో జట్టుకు ఒక్కో సంస్థ స్పాన్షర్ చేస్తుంది. ఈ జట్ల ద్వారా ఆయా సంస్థలు భారీ మొత్తంలో ఆదాయాన్ని అర్జిస్తుంటాయి. ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్ ను రిలయన్స్ సంస్థ స్పాన్సర్ చేస్తోంది. ఈ జట్టు ద్వారా అంబానీ ఏటా భారీగానే ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
ఈ ఏడాది ఎన్ని కోట్లు సంపాదించారనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అంబానీ ఎంత సంపాదించారు. ఎలా వచ్చిందో మీరు చదివేయండి.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ లో 100 శాతం వాటాతో నీతా, ముఖేష్ అంబానీలే ఏకైక యజమానులుగా కొనసాగుతున్నారు. మిలియన్ డాలర్లుతో 2008లో ఈ జట్టును కొనుగోలు చేశారు. తొలి సీజన్ లో జట్టు కొనుగోలుకు రూ.916 కోట్లు వెచ్చించారు. ఇప్పటి వరకు ఐదు టైటిళ్లను సాధించి.. 2023 వరకు అత్యధిక సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్లను గెలుచుకుని ఆదాయం విషయంలో వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోంది ముంబై ఇండియన్స్ జట్టు. ఈ ఏడాది కూడా భారీ మొత్తంలోనే ఆదాయాన్ని సంపాదించింది.
గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లు మేర పెరిగిన ఆదాయం..
ముంబై ఇండియన్స్ జట్టుకు పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు ఉన్నారు. ఐపీఎల్ లో ఎక్కువ మంది స్పాన్సర్లు కలిగిన చెట్టు కూడా ఇదే కావడం గమనార్హం. ది ట్రిబ్యూన్ ప్రకారం ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూషన్ రూ.10,070 కోట్లకుపైమాటే. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం దాదాపు రూ.200 కోట్లు మేర పెరిగింది. ఇప్పటి వరకు అత్యంత లాభదాయకమైన జట్టు కూడా ముంబై ఇండియన్స్. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా వృద్ధిని నమోదు చేసిన ఏకైక జట్టు ఇదే కావడం విశేషం.
ఆదాయం ఎలా వస్తుందంటే..
ముంబై ఇండియన్స్ జట్టుకు టికెట్ ధరలతోపాటు మీడియా స్పాన్సర్షిప్పులు, ప్రకటనలు ద్వారా ఆదాయం వస్తుంది. ఇది అంతా ఒక ఎత్తు అయితే మరో ప్రధాన ఆదాయ వనరు జియో సినిమాకు విక్రయించిన ఐపీఎల్ హక్కుల ద్వారా ఆర్జించింది మరో ఎత్తు. తొలి ఐదు వారాల్లోనే జియో సినిమా రికార్డు స్థాయిలో రూ.1300 కోట్ల వీడియో విక్షణలను అందుకుంది. దీని ద్వారా భారీ మొత్తంలో ముంబై జట్టుకు ఆదాయం వచ్చింది.
టెలీ కాస్టింగ్ హక్కులను కొనుగోలు చేసిన జియో సినిమా..
రిలయన్స్ బ్రాండ్ వియోకామ్18, జియో సినిమా ఐపీఎల్ టెలి కాస్టింగ్ హక్కులను రూ.22,290 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతోపాటు జియో సినిమా ఐపీఎల్ ను మొదటి హోస్ట్ చేయడం ద్వారా రూ.23 వేల కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో వేల కోట్లను కూడా ఆర్జించనుందని అంచనా. దీంతోపాటు గ్లోబల్ ఫ్రాంచైజీలు ద్వారా కూడా భారీ ఆదాయాన్ని రిలయన్స్ సంస్థ సాధిస్తోంది. ఈ విధంగా చూసుకుంటే ఐపీఎల్ ద్వారా ముంబై ఇండియన్స్ యాజమాన్య సంస్థ రిలయన్స్ ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఐపీఎల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తుంటుంది. అందుకే సిజన్ మారినా సరే టోర్నీలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటోంది.