James Cameron: ప్రపంచం మెచ్చిన దర్శకుల్లో జేమ్స్ కామెరూన్ ఒకరు.ఆయన సినిమాలు లార్జర్ దన్ లైఫ్ స్కేల్ లో తెరకెక్కుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఆద్యుడు అని చెప్పొచ్చు. కామెరూన్ చిత్రాల్లో ఫ్యూచర్ చూడవచ్చు. దర్శకుడిగా కామెరూన్ మొదటి చిత్రం ఫిరానా 2. నిజానికి ఫిరానా 2 చిత్రానికి కామెరూన్ ని స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అసలు డైరెక్టర్ మిల్లర్ డ్రేక్ నిర్మాతతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా తప్పుకున్నారు. అలా కామెరూన్ కి ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఫిరానా 2 మంచి విజయం సాధించింది.

James Cameron
ఫిరానా విడుదలైన రెండేళ్లకు కామెరూన్ డైరెక్షన్ లో టెర్మినేటర్(1984) విడుదలైంది. ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన టెర్మినేషన్ ఓ సంచలనం. తమ ఓటమికి కారణమైన వ్యక్తిని చంపేందుకు భవిష్యత్ నుండి ఒక రోబో ప్రస్తుతంలోకి వస్తుంది. ఆర్నాల్డ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న టెర్మినేటర్ రోల్ చేశారు. నలబై ఏళ్ల క్రితం ఇంత అడ్వాన్స్ గా ఆలోచించడం గొప్ప విషయం. మనిషి మేధో శక్తిని నుండి పుట్టిన యంత్రాలు మనిషికి ఎదురు తిరిగితే ఏంటనేది ప్రధాన కాన్సెప్ట్. శంకర్ రోబో, 2.0 చిత్రాలకు టెర్మినేటర్ సిరీస్ స్ఫూర్తి.
ఇక టైటానిక్ తో జేమ్స్ కామెరూన్ ప్రపంచ సినిమా చరిత్ర తిరగరాశారు. వాస్తవ కథకు ట్రాజిక్ లవ్ స్టోరీ జోడించి ఒక అద్భుత దృశ్యకావ్యం జేమ్స్ కామెరూన్ రూపొందించారు. దశాబ్దాల పాటు టైటానిక్ వసూళ్ళ రికార్డ్స్ ఎవరూ టచ్ చేయలేకపోయారు. 1997లో విడుదలైన టైటానిక్ ఇప్పటికీ వరల్డ్ హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాల్లో మూడవ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఆయనే రూపొందించిన అవతార్ ఉంది. టైటానిక్ తర్వాత జేమ్స్ కామెరూన్ క్రియేటివిటీ నుండి పుట్టిన విజువల్ వండర్ అవతార్. 2009లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ మూవీ అవతార్ వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

James Cameron
ఇంత గొప్ప క్రియేటివ్ జీనియస్ జేమ్స్ కామెరూన్ వైవాహిక జీవితంలో ఫెయిల్ అయ్యాడు. ఆయన ఏకంగా ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నారు. ఒక్కొక్కరిగా విడాకులు ఇచ్చుకుంటూ ఐదుగురు మహిళలను భార్యలుగా తెచ్చుకున్నారు. 1978లో షారోన్ విలియమ్స్ ని పెళ్లి చేసుకున్న జేమ్స్ కామెరూన్ 1984లో ఆమెకు విడాకులు ఇచ్చారు. రెండో వివాహంగా 1985లో నటి గాలె అన్నే హర్డ్ ని చేసుకున్నారు. ఆమెకు 1989లో విడాకులు ఇచ్చారు. అదే ఏడాది నిర్మాత కేథరిన్ బిగ్లో ని పెళ్లి చేసుకున్నారు. 1991లో ఆమెతో కూడా విడిపోయాడు. టెర్మినేటర్ ఫేమ్ లిండా హామిల్టన్ ని 1997లో వివాహం చేసుకున్నారు. ఆమెకు 1999లో విడాకులు ఇచ్చారు. 2000 సంవత్సరంలో ఆయన సుజి అమిస్ అనే అమెరికన్ అడ్వాకేట్ ని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఆయన జీవితంలో ఉన్నారు.