Maheswari: నైన్టీస్ యూత్ కి మహేశ్వరి బాగా తెలిసిన పేరు. చాలా తక్కువ సమయంలో మహేశ్వరి పాపులారిటీ తెచ్చుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో 1995లో విడుదలైన గులాబి ఓ సెన్సేషన్. అప్పటికి అది ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. జేడీ చక్రవర్తి హీరోగా నటించారు. గులాబి మంచి విజయం సాధించింది. మహేశ్వరి గ్లామర్, ఆమె హస్కీ వాయిస్ ప్రేక్షకులకు కొత్తగా తోచాయి. ఆ మూవీ మహేశ్వరిని ఓవర్ నైట్ స్టార్ చేసింది. అయితే ఆ రేంజ్ హిట్ మహేశ్వరికి మరలా పడలేదు.

Maheswari
గులాబి చిత్రంలో సునీత పాడిన ‘ఈ వేళలో నీవు’ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఆ సాంగ్ ప్రేమికుల ఫేవరేట్ గా ఉంది. తర్వాత జెడి చక్రవర్తి, మహేశ్వరి కాంబినేషన్ లో వరుసగా చిత్రాలు వచ్చాయి. దెయ్యం, మృగం వంటి చిత్రాలు చేశారు. ఆ సమయంలో వీరి మధ్య ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. మహేశ్వరి కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్ పెళ్లి. వడ్డే నవీన్ హీరోగా బబ్లు పృథ్విరాజ్ కీలక రోల్ చేశారు.
కెరీర్ బిగినింగ్ లో మెరుపులు మెరిపించిన మహేశ్వరి త్వరగానే ఫేడ్ అవుట్ అయ్యారు. సెకండ్ హీరోయిన్ పాత్రలకు ఆమెను దర్శక నిర్మాతలు పరిమితం చేశారు. మహేశ్వరి చివరి చిత్రం తిరుమల తిరుపతి వెంకటేశ. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీలో రవితేజకు జంటగా మహేశ్వరి నటించారు. శ్రీకాంత్ మెయిన్ హీరో కావడం విశేషం. కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో మహేశ్వరి సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. 2008లో మహేశ్వరి జయకృష్ణ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె అసలు కనిపించడం మానేశారు.

Maheswari
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే శ్రీదేవికి మహేశ్వరి బంధువు. శ్రీదేవి ఆమెకు స్వయానా పిన్ని అవుతుంది. మహేశ్వరి తల్లి శ్రీదేవి అక్కాచెల్లెళ్లు. అయితే మహేశ్వరి-శ్రీదేవి మధ్య చిన్నమ్మ అని పిలిచేంత ఏజ్ గ్యాప్ లేదు. దీంతో శ్రీదేవిని అక్క అని పిలిచేవారు. దీంతో మహేశ్వరి శ్రీదేవి చెల్లెలు అనుకునేవారు. శ్రీదేవితో మహేశ్వరికి రిలేషన్ వున్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఆమె ఇంటర్వ్యూల్లో ఓపెన్ అయ్యాక మాత్రమే ఈ సంగతి జనాలకు తెలిసొచ్చింది. ఆ మధ్య ఆలీతో సరదాగా షోలో మహేశ్వరి పాల్గొన్నారు. హీరోయిన్ గా ఉన్నప్పటి మహేశ్వరికి ఇప్పతి మహేశ్వరికి చాలా తేడా ఉందని చెప్పాలి. ఏజ్ తో పాటు ఎవరైనా మారిపోతూ ఉంటారు కదా. తాజాగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీని మహేశ్వరి కలిశారు. జాన్వీ-మహేశ్వరి కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.