
Hailstones
Hailstones: ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నాయి. వడగళ్లు కడగళ్లు మిగుల్చుతున్నాయి. రైతులకు నష్టాలు తీసుకొస్తున్నాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానతో పంటలు దెబ్బతింటున్నాయి. ఎటు చూసినా రాళ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో పంటలు చేతికొచ్చే అవకాశాలు లేవు. ఇలా ప్రకృతి వైపరీత్యంతో రైతుల గుండెల్లో భయం కలుగుతోంది. ఆరుగాలం పండించిన పంటలు చేతికి అందుతాయో లేదో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో వడగళ్ల వానలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
వడగళ్లను కొందరు తినాలని చూస్తారు. కానీ అది మంచిది కాదు. వడగళ్లలో సల్ఫేట్స్, నైట్రేట్స్, అమ్మోనియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు వంటి రసాయనాలతో ఏర్పడతాయి. ఇందులో కెమికల్స్ గాఢత తక్కువ ఉన్నా అందులో ఉండే దుమ్ముతో పాటు కాలుష్య ఉద్గారాలు ఉంటాయి. అందుకే వడగళ్లను తింటే అనర్థాలు చోటుచేసుకుంటాయి. వాటిని తినకపోతేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తిన్నా మనకు ఇబ్బందులు రావడం ఖాయం. దీంతో జాగ్రత్తగా ఉండాలంటే వాటిని తినొద్దు.
చూడటానికి మంచు ముద్దల్లా మెరుస్తుంటాయి. ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే వాటిని నోట్లో వేసుకోవాలని ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ వాటిని తినడం సురక్షితం కాదని తెలుసుకోవాలి. పొరపాటున కూడా పిల్లలు వాటిని తినకుండా జాగ్రత్త పడాలి. వడగళ్లను తినడం వల్ల మనకు అనారోగ్యాలు దరిచేరతాయి. చల్లగా ఉండే వాటిని తినడం వల్ల మన శారీరక వ్యవస్థ దెబ్బతింటుంది. జ్వరం వంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈనేపథ్యంలో వాటిని నోట్లో వేసుకోకుండా ఉండటమే మంచిది.

Hailstones
వడగళ్ల వానలు సరిగ్గా మార్చి నెలలోనే వస్తాయి. ఈ నెలలోనే వరి పంట పొట్ట దశకు వస్తుంది. కూరగాయలు, మామిడి పంటలు దెబ్బతింటాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టమే. కానీ వడగళ్ల వానలు ప్రతి సంవత్సరం రావడం సహజమే. పంటలు నాశనం చేస్తుంది. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వడగళ్ల వాన ప్రభావంతో రైతులకు దుఖమే మిగులుతుంది. అలా వడగళ్ల వాన ఒక బెల్టుగా వస్తుంది. వరుసగా ఉండే పొలాలపై పెను ప్రభావం చూపుతుంది. పంటలను ధ్వంసం చేసి వెళ్తుంది.