Alien Hand On Beach: బీచ్ ఒడ్డున ఏలియన్ చేయి.. ఎంత పెద్దగా ఉందో తెలుసా?
Alien Hand On Beach: ఏలియన్ (గ్రహాంతర వాసి) లు ఉన్నారనే కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. వారు భూమిపైకి అప్పుడప్పుడు వస్తున్నారనే వదంతులు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి కదలికలు, వారి మనుగడపై రకరకాల ప్రశ్నలు రావడం సహజమే. దీంతో అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎలా ఉంటారు? అనే వాదనలు సైతం వస్తున్నాయి. గ్రహాంతర వాసుల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వారి కదలికలు ఉన్నాయనే పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో […]

Alien Hand On Beach: ఏలియన్ (గ్రహాంతర వాసి) లు ఉన్నారనే కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. వారు భూమిపైకి అప్పుడప్పుడు వస్తున్నారనే వదంతులు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి కదలికలు, వారి మనుగడపై రకరకాల ప్రశ్నలు రావడం సహజమే. దీంతో అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే ఎలా ఉంటారు? అనే వాదనలు సైతం వస్తున్నాయి. గ్రహాంతర వాసుల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వారి కదలికలు ఉన్నాయనే పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏలియన్ల గురించి చర్చ సాగుతోంది.

Alien Hand On Beach
తాజాగా బ్రెజిల్ లోని బీచ్ లో ప్రేమికులు లెటిసియా గోమ్స్, ఆమె బాయ్ ఫ్రెండ్ డెవనీర్ సౌజ్ కు ఓ అస్థిపంజరం కనిపించింది. దీంతో వారు కంగారు పడ్డారు. ఇది ఎవరిదో అని ఫొటోలు కూడా తీశారు. కానీ దాని శరీర పరిమాణం చాలా పెద్దగా ఉండటంతో అది గ్రహాంతర వాసి అస్థిపంజరమే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. అస్థిపంజరం చేతి వేలు చాలా పెద్దగా ఉండటమే దీనికి నిదర్శనం. దీంతో వారు దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో పలు రకాల కామెంట్లు వస్తున్నాయి.
ఆ అస్థిపంజరం కచ్చితంగా మామూలు మనుషులది కాదని ఏలియన్ దే అయి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు కూడా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో అది జలకన్య చేయి అయి ఉంటుందని చెబుతున్నారు. మరికొందరైతే అది డైనోసార్ చేయి కావచ్చని సంశయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అందరు ఎవరికి తోచిన విదంగా వారు తమ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆ అస్థిపంజరం విషయంపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Alien Hand On Beach
సముద్ర జీవ శాస్త్రవేత్త మాత్రం అది డాల్ఫిన్, తిమింగలం వంటి జాతికి చెందిన అస్థిపంజరంగా చెబుతున్నారు. దాదాపు 18 నెలల క్రితం అదే ప్రాంతంలో ఓ సముద్ర జీవి చనిపోయిందని దాని అస్థిపంజరమే కావొచ్చని స్పష్టం చేయడంతో అందరిలో అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంతకీ అస్థిపంజరం ఏలియన్ దా? మరెవరిది అనేది పరిశోధన జరిగితే కాని తెలియదు. అంతవరకు మనం కూడా వేచి చూడాల్సిందే. పరిశోధిస్తే దాని గురించి నిజాలు బయటకు రావని చెబుతున్నారు. మొత్తానికి అస్థిపంజరం అందరిలో భలే అనుమానాలకు కేంద్రంగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
