మేషం :
మేష రాశివారికి ఈ వారం కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడుస్తుంది. ఈ వారం కొన్ని ప్రయాణాలు ఉంటాయి. గత కొంత కాలంగా నిలిచిన, ఆగిపోయిన పనులల్లో పురోగతి. ఉన్నత విద్య, మరియు అవకాశాల కోసం వేచి చూస్తున్న వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. ఈ వారం అంతా కూడా ఉత్సహంగా ఉల్లాసంగా గడుపుతారు. మీ శత్రువులు కూడా మిమల్ని ఆదరిస్తారు. వ్యాపార రంగాలవారికి పూర్తిగా అనుకూలిస్తాయి. మంచి లాభాలు కూడా మీకు చేతికి అందుతాయి. ఉయోగస్థులకి ఎదురవుతున్న ఒడిదుడుకులు అన్ని కూడా తొలిగిపోతాయి. ఈ వారం మీకు మనోధైర్యం కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. ఈ రాశి వారి ఈ వారం సుబ్రమణ్య స్వామి వారిని పూజించడం, ఆరాధించడం మంచిది.
Horoscope This week in Telugu 2021
వృషభ రాశి :
ఈ రాశి వారు ఈ వారం అంతా బంధువుల తోటి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. విజయవంతంగా తమ పనులని సకాలంలో పూర్తి చేసి తమ సత్తాని కూడా చాటుకుంటారు. సంగం లో ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడుతాయి. నిరుద్యోగులు తాము కోరుకున్న ఉద్యోగం లభించడం వలన ఎంతో సంతోషిస్తారు. ఆరోగ్యం కూడా ఈ రాశివారికి గత వారం కంటే కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వర్గాల వారికి కొన్ని సమస్యలు తీరడం వలన కొంచెం ఊరట లభిస్తుంది. ఉద్యోగస్తులు పని ఒత్తిడి నుంచి బయట పడతారు. ప్రశాంతంగా ఈ వారం కొనసాగిస్తారు. కళా రంగం వారు సాంకేతిక రంగం వారు తమ లక్ష్యాల్ని తేలికగా సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం దుర్గ అమ్మవారిని పూజించడం చాల మంచిది.

weekly-horoscope-telugu-1-2021
మిథున రాశి :
నిరుద్యోగులకు భవిష్యత్తు పట్ల మంచి ఆశలు చిగురిస్తాయి.. మంచి అవకాశాలు వీరికి లభిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వారం పూర్తి చేస్తారు. సన్నిహితులు కూడా వీరి అభిప్రాయాలు గుర్తిస్తారు ప్రోత్సహిస్తారు. ఎవరైతే గత కొంత కాలంగా గృహాలు, వాహనాలు కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నారో వారికి ఆటంకాలు అన్ని తొలిగిపోతాయి. ఈవారం ఈ రాశి వారికి అనుకున్నంత ఆదాయం దక్కడమే కాకుండా రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. కుటుంబంలో కూడా వీరికి సత్సంబంధాలు కూడా మెరుగవుతాయి. కుటుంబ సభ్యులలో ఎవరికైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా తొలిగిపోతాయి. వ్యాపార రంగం వారు వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా చేపడతారు. ఉద్యోగస్తులు తమకి ఉన్న అదనపు భారం అంతా కూడా తొలగిపోతాయి. రాజకీయ రంగం వారు, కళా రంగం వారు కోరుకున్నవి సాధిస్తారు. దీని వలన వీరు సంతోషంగా గడుపుతారు. మహిళలలకు సోదరుల ద్వారా శుభవార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది.
కర్కాటక రాశి:
కష్టమైన పనులని సకాలం లో పూర్తి చేస్తారు. కుటుంబం లో వీరిపట్ల ప్రేమ అభిమానాలు కూడా పెరుగుతాయి. ఆదాయం సమకూర్చుకోవడం వంటి వాటిలో ఉన్న ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. కొన్ని జటిలమైన సమస్యలు కూడా వీరు ఈవారం తేలికగా పరిష్కరించుకుంటారు. దీని వలన ఆనందంగా గడుపుతారు. తరచూ తీర్థ యాత్రలు కూడా చేస్తారు. ఒక సంఘటన ఈవారం వీరిని బాగా ఆకట్టుకుంటుంది. వ్యాపారస్తులకు ఈవారం వ్యాపారంలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. రాజకీయవేత్తలు, కళా రంగం వారు అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మహిళలు ఈవారం అంతా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. కర్కాటక రాశి వారు ఈవారం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుణ్ణి పూజించడం ఆరాధించడం మంచిది.
సింహ రాశి :
ఈ వారం ఏ వ్యవహారం చేపట్టినా కూడా విజయపథం లో నడిపిస్తారు. ఆప్తులతోటి ఆనందంగా గడుపుతారు, గత కొంత కాలంగా వాహనాలు, బంగారు ఆభరణాలు ఎవరైతే కొనాలి అని వేచి చూస్తున్నారో ఈవారం అంతా కూడా ఒక కొలిక్కి వస్తుంది. Horoscope this week in telugu ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. సమస్యల పరిష్కారం లో వీరు చొరవ తీసుకొని పరిష్కారించుకుంటారు. వ్యాపార రంగం వారు మరింత పురోగతిలో ముందుకి దూసుకెళ్తారు. ఉద్యోగాస్తులకి ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. దీనివలన వీరు కాస్త ఊపిరిపీల్చుకుంటారు మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రాజకీయ పరిశ్రమకు రంగానికి చెందినవారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మహిళల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని వలన మహిళలు కాస్త సంతోషంగా గడుపుతారు. ఇక ఈ రాశి వారు ఈవారం అంతా కూడా నిత్యం సూర్య భగవానుడిని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది.

rashi-phalalu-this-week-telugu
కన్య రాశి:
చేపట్టిన కార్యక్రమాలు ఈవారం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన వ్యక్తులతో కూడా ఈవారం ఈ రాశి వారికి ఏర్పడుతాయి. ఆదాయ మార్గాలు కూడా మరింతగా మెరుగుపడతాయి. దీనివలన కూడా కాస్త ఊరట చెందుతారు. గతంలో జరిగిన పొరపాటులని కూడా సరిదిద్దుకొని కొన్ని నిర్ణయాలు కూడా మార్చుకుంటారు. విద్యార్థులు ప్రధానంగా విదేశీ చదువుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ప్రయత్నిస్తున్నారో వారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార రంగం వారు ఎవరికైతే గత కొంత కాలంగా గందరగోళం ఉందొ దాని నుంచి బయట పడతారు. ఉద్యోగస్తులు తాము అనుకున్న లక్ష్యాల్ని సులువుగా సాధిస్తారు. పై అధికారుల మెప్పుని కూడా చోరగొంటారు. కళా రంగం వారు, పారిశ్రామిక రంగానికి చెందిన వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. మహిళల యొక్క ఆశలు కూడా నెరవేరుతాయి. కన్య రాశి వారు ప్రతి నిత్యం విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది.
Horoscope This week in Telugu: ఈ వారం రాశి ఫలాలు 17 oct 2021 to 23 oct2021
తుల రాశి:
ఊహించని విధంగా కొన్నిముఖ్య మైన వ్యవహారాల్లో ఈ వారాం తుల రాశి వారు విజయాన్ని సాధిస్తారు. రాబడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈవారం అంతా కూడా నడుస్తుంది..చిన్న నాటి జ్ఞాపకాలు కూడా ఈవారం గుర్తుకు తెచ్చుకుంటారు. Rashi phalalu 2021 ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆభరణాలు, నూతన వాహనాలు కొనుగోలుకు డబ్బుని సమకూర్చుకుంటారు. భవిష్యత్ పట్ల నూతన ఆశలు వీరికి చిగురిస్తాయి ఉద్యోగస్తులు గత కొంత కాలంగా చిక్కులు, సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి.. రాజకీయ రంగానికి చెందిన వారికి ఈవారం అంతా కూడా ప్రోత్సహకంగా గడుస్తుంది. మహిళలు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. ప్రదనంగా తుల రాశి వారు ఈవారం అంతా కూడా దుర్గ అమ్మవారిని పూజించడం మంచిది.

weekly-horoscope-telugu-2021
వృశ్చిక రాశి:
ఆర్థిక పరంగా కొంత వరకు ఈ వారం బలపడుతారు..సంగం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారరంగాల వారికి వ్యాపారం వారం మొదట్లో కొంత నిరాశక్తిగా కొనసాగినప్పటికీ మంచి లాభాలను క్రమేపి సంపాదిస్తారు.క్రమేపి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాస్తులకి ఈవారం నూతన హోదాలు దక్కే అవకాశం ఉంది. ఎవరైతే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈవారం శుభవార్తలు అందుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి, కళా రంగాల వారికి ఊహించని అవకాశాలు దక్కే అవకాశం. మహిళలు ఈ వారం ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు సంతోషంగా గడుపుతారు. ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఈవారం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించడం చాల మంచిది.
ధనుస్సు రాశి:
ఈ వారం ఈ రాశి వారికి ధనం సమృద్ధిగా ఉంటుంది. ఈవారం అంతా కూడా ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టు రంగానికి చెందిన వారికి కాంట్రాక్టులు దొరుకుతాయి. భూమి కొనుగోలుకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈవారం ఒక కొలిక్కి వస్తుంది. చిన్న నాటి స్నేహితులతోటి చిన్ననాటి జ్ఞాపకాలను, విజయాలను వారితో పంచుకుంటారు. సేవ ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు రాశి ఫలాలు 2021 పరిచయాలు కూడా పెరుగుతాయి. వ్యాపార రంగాల వారికి గతం కంటే కూడా అధికంగా ఈవారం లాభాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయి పై అధికారుల మెప్పుని కూడా చోరగొంటారు. రాజకీయ, కళారంగానికి చెందిన వారికి అందే ఆహ్వానాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మహిళలలకు తండ్రి తరపున ఉండే స్థిరాస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం దత్తసాయి స్వామి వారిని, సాయి బాబా ని పూజించడం మంచిది.
Horoscope This week in Telugu 17 oct 2021 to 23 oct2021
మకర రాశి:
ఈ వారం ఈ రాశి వారు ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతవుతారు..అనుకున్న పనులు ముందుకు సాగకపోవడం వలన నిరాశ చెందుతారు.
చిన్ననాటి విషయాలని గుర్తుకు తెచ్చుకుంటారు. బంధువర్గం వారి నుంచి కలహాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. కనుక మకర రాశి వారు ఈ వారం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ఈ వారం మకర రాశి వారు తీసుకునే నిర్ణయాలని కూడా కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. ధార్మిక కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార రంగం వారు ఎంత అప్రమత్తుమంగా ఉంటే అంతా మంచిది తొందరపాటు నిర్ణయాలు వ్యాపారస్తులకు మంచిది కాదు. నూతన పెట్టుబడులతో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఉద్యోగాస్తులకి కూడా నిత్యం ఎదో ఒక సమస్య ఎదురవుతుంది. దీని వలన కోపం, చికాకు, అసహనం అన్ని అధికంగా ఉంటాయి. పరిశ్రమకు వేత్తలు అవకాశాలు చేజారి పోవడం వలన నిరాశ చెందుతారు. మహిళలలకు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం, స్వామి వారి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
కుంభం రాశి:
ప్రధానంగా ఈ వారం రాబడి అధికంగా ఉండటం వలన వీరి సంతోషానికి హద్దు ఉండదు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉండే గొడవలు, సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి. కొన్ని వేడుకలుకు కూడా వీరు ముఖ్య అతిధిగా హాజరవుతారు. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. ఆప్తుల సహాయంతో కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం గతం కంటే కూడా మెరుగుపడుతుంది. విద్యార్థులు అంచనాలు అని కూడా నిజమవుతాయి. వ్యాపార రంగాల వారు వ్యాపార విస్తరణ పనులు ముమ్మరం చేస్తారు. నూతన భాగస్వాములతోటి ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు వాటంతట అవే తొలగుతాయి. మహిళలలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రధానంగా కుంభ రాశివారు ఈ వారం అంతా ఆంజనేయ స్వామి వారిని పూజించడం మంచిది.
మీనం రాశి:
మీన రాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఈ వారం ఒక కీలక మైన సందేశం అందుకుంటారు. భూములు, వాహనాలు ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి నెరవేరే అవకాశం ఉంది. ఆదాయం ఈ రాశివారికి సంతోషాన్ని ఇస్తుంది. నిరుదోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులనుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు. గృహనిర్మాణాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కలిసివస్తాయి. వివాహాది వేడుకలకు కూడా ఈవారం ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారంగలవారికి ఈ వారం వ్యాపారం సానుకూలంగా సాగుతాయి.దీనివలన కాస్త ఊరట చెందుతారు