Horoscope : ఈ రాశి వారు ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే?
ఉద్యోగులు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతల్లో కొన్నింటిని పూర్తి చేయడానికి కష్టపడుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 1న బుధవారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారు ఈరోజు ఎలాంటి కష్టాన్నైనా అధిగమిస్తారు. వీరికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. మనసులో నుంచి ప్రతికూల ఆలోచనలను దూరంగా పెట్టాలి.
వృషభం:
జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉంటారు. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. తండ్రి సహాయంతో ఓ సమస్యను పరిష్కరించుకుంటారు.
మిథునం:
ఆర్థికంగా లాభపడుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి సంకల్పిస్తారు. మనుసు ఉల్లాసంగా ఉంటుంది. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పెట్టుబడులు పెడుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. తల్లి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆందోళన చెందుతారు. పెట్టుబడులు పెట్టేవారికి అనుకూల సమయం.
సింహం:
రోజూవారీ అవసరాలకు డబ్బు అందుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఓ సమస్య పరిష్కారానికి సోదరుని సహాయం తీసుకుంటారు.
కన్య:
ఈ రాశివారికి అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పనులను పెండింగులో ఉంచుకోవద్దు. ఒప్పందాలు చేసుకునేవారు అన్ని పత్రాలను సరిచూసుకోవాలి. లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
తుల:
కొత్త పని ప్రారంభించాలనుకుంటారు. దానికి అనుకూల సమయమే. బంధువుల నుంచి కొంత డబ్బు సాయం అందుతుంది. ఇంట్లో ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి.
వృశ్చికం:
ఈరోజు తీసుకునే నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి.జీవిత భాగస్వామితో వివాదాలుంటే పరిష్కారమవుతాయి. వ్యాపారానికి సంబంధించి సుదూర ప్రయాణాలు చేస్తారు.
ధనస్సు:
వ్యాపారులు నగదు కొరత ఎదుర్కొంటారు. అప్పుల కోసం ఒత్తిడి పెరగవచ్చు. కొందరు రుణ దాతలను కలుస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వారితో ఆనందంగా గడుపుతారు.
మకరం:
సమాజంలో గౌరవం పెరుగుతంది. ఆర్తిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. తక్కువ ఖర్చులు ఉంటాయి. అయినా అవసరాతు తీరుతాయి.
కుంభం:
ప్రత్యర్థులపై అధిపత్యం చెలాయిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుంటారు. ఈరోజు చేపట్టే ప్రతీ పనిలో విజయం మీదే అయి ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారులతో వివాదాలు ఉండే ఛాన్స్.
మీనం:
ఉద్యోగులు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతల్లో కొన్నింటిని పూర్తి చేయడానికి కష్టపడుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
